హిందువులకు హలాల్ భోజనం అందివ్వం : ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ విమానాల్లో ప్రయాణించే హిందువులు, సిక్కులకు హలాల్ భోజనాన్ని అందించమని ప్రకటించింది. హలాల్ భోజనాన్ని ఆపేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. అయితే ముస్లిం ప్రయాణికులు ముందే తమ భోజనాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఎయిర్ ఇండియా విమానాల్లో ఆహార విషయంలో పలుమార్లు వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిందూ, సిక్కుల ప్రాధాన్యతలను గౌరవించిందని నెటిజన్స్ హర్షం వ్యక్తం చేశారు.
ఒక పత్రికా ప్రకటనలో, ఎయిర్ ఇండియా ఇలా పేర్కొంది, “MOML (ముస్లిం భోజనం): ‘MOML’ స్టిక్కర్‌తో లేబుల్ చేయబడిన ప్రీ-బుక్ చేసిన భోజనం ప్రత్యేక భోజనం (SPML)గా పరిగణించబడుతుంది. ముందుగా బుక్ చేసిన MOML భోజనం కోసం మాత్రమే హలాల్ సర్టిఫికేట్ అందించబడుతుంది. సౌదీ అరేబియాకు వెళ్లే విమానాల్లోని అన్ని భోజనాలు హలాల్ సర్టిఫికేట్ పొందుతాయి, హజ్ విమానాలతో సహా జెడ్డా, దమ్మామ్, రియాద్ మరియు మదీనా ప్రాంతాలకు హలాల్ సర్టిఫికేట్ అందుబాటులో ఉంటుంది.’’ అని పేర్కొంది.