ఉద్రిక్తతలు పెంచేలా పాక్ వ్యవహరిస్తే.. మరింత గట్టిగా జవాబిస్తాం : దోవల్
ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం దాడులు చేపట్టిన విషయం తెలిసిందే.ఇదే విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు ఇతర దేశాలకు కూడా వివరించారు. ఇందులో భాగంగా అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శలకు దోవల్ ఆపరేషన్ సిందూర్ గురించి పూర్తిగా వివరించారు. వీరితో పాటు చైనా విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడారు.ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి గల కారణాలను కూడా వివిధ దేశాల ప్రతినిధులకు దోవల్ వివరించారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడులను వివరించారు. ఈ సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడుతూ.. పరిస్థితులను తీవ్రతరం చేసేలా పాక్ వ్యవహారం వుంటే.. భారత్ నుంచి ప్రతిస్పందన మాత్రం మరింత గట్టిగా వుంటుందని తేల్చి చెప్పారు. అయితే.. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం తమకు ఏమాత్రమూ లేదని తెలిపారు.