భద్రత అనేది ప్రభుత్వాల పనే కాదు.. పౌరుల బాధ్యత కూడా : దోవల్

ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత అనేది కేవలం ప్రభుత్వాల పనే కాదని ,అది ప్రతి పౌరుడిపైనా వుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సూచించారు. భారత్ ప్రస్తుతం చారిత్రక పరివర్తన దిశగా పయనిస్తోందని, ఈ సమయంలో భద్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. గాంధీనగర్ లోని ‘‘రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం’’ స్నాతకోత్సవంలో అజిత్ దోవల్ పాల్గొన్నారు.

దేశ సైన్యంతో, ఆయుధ సంపత్తి, సంపదతో మాత్రమే ఏ దేశ బలాన్నైనా కొలవలేమని దోవల్ పేర్కొన్నారు. నిజమైన బలం నఅేది ప్రజల మనోబలంలోనూ, దేశం పట్ల వారికున్న విధేయతలోనూ ఇమిడి వుంటుందన్నారు. ప్రజల సంకల్పం దృఢంగా, బలంగా వుంటే ఎంతటి సవాళ్లనైనా అధిగమించవచ్చని సూచించారు.

చరిత్ర నుండి ఉదాహరణలను ఉటంకిస్తూ, అమెరికా మరియు సోవియట్ యూనియన్ వంటి శక్తివంతమైన దేశాలు కూడా ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం వంటి ప్రాంతాలలో సంపూర్ణ విజయాన్ని సాధించలేకపోయాయని పేర్కొన్నారు. దీనికి కారణం ఆ దేశాల సైనిక బలహీనత ఎంత మాత్రమూ కాదని, ప్రజల నుంచి ఎదురైన తీవ్ర ప్రతిఘటన, వారి ఆత్మ విశ్వాసం దెబ్బతినడమే అని అన్నారు. ఏ సంఘర్షణలోనైనా ప్రజల మనోధైర్యమే కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

జాతీయ భద్రత అనేది కేవలం యుద్ధానికి గానీ, సరిహద్దుల రక్షణకు గానీ మాత్రమే పరిమితం కాదనిదౌత్యం, సాంకేతికత, వనరులు మరియు మానవ వనరుల వంటి వివిధ అంశాల పరిధిలో వుంటుందని దోవల్ వివరించారు. వీటన్నంటికి మించి ప్రజల ఐకమత్యం, దేశభక్తి ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *