అల్ ఫలాహహ్ యూనివర్శిటీ చైర్మన్ అహ్మద్ సిద్దిఖీ అరెస్ట్
మోసం, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ అల్ ఫలాహహ్ యూనివర్శిటీ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002లోని సెక్షన్ 19 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధిఖీని అరెస్టు అరెస్ట్ చేసింది. సిద్ధిఖీని ఢిల్లీ కోర్టులో హాజరుపరచగా, నాలుగు రోజుల పాటు పోలీసు రిమాండ్ కి పంపారు. యూజీసీ ఫిర్యాదు ఆధారంగా సిద్దిఖీపై క్రైమ్ బ్రాంచీ రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్ లను నమోదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రధానంగా మోసం, అక్రమ ఆర్ధిక కార్యకలాపాలపైనే ఈ అరెస్ట్ జరిగిందని అంటున్నారు.
సిద్దిఖీ అరెస్ట్ అనేది విచారణలో పెద్ద మలుపు అని, విచారణ కొనసాగే కొద్దీ మరిన్ని వివరాలు కూడా బయటికి వస్తాయని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామానికి ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న చర్యలు కూడా ఆ సంస్థపై నిఘాను మరింత పెంచాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కార్యకలాపాలు ప్రారంభించిన అనంతరం క్రైమ్ బ్రాంచ్ ఈ చర్య చేపట్టింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుళ్ల తర్వాత అల్ ఫలాహ్ యూనివర్శిటీ కార్యకలాపాల్లో అవకతవకలు మరియు మోసానికి పాల్పడినట్లు క్రైమ్ బ్రాంచ్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ ఉగ్రపేలుడు తర్వాత అల్ ఫలాహ్ యూనివర్సిటీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. అల్ ఫలా యూనివర్శిటీకి చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ ట్రస్టీల ప్రాంగణంలోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. అలాగే అల్ ఫలా యూనివర్శిటీ చైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీ ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు జరిగాయి. ‘‘ఆర్థిక అవకతవకలు, షెల్ కంపెనీల వాడకం, మనీలాండరింగ్ తో పాటు మరికొన్నింటిని దృష్టిలో పెట్టుకొనే ఈ ఆపరేషన్ కొనసాగింది.
కొన్ని రోజుల క్రితం ఎర్రకోట దగ్గర పేలుళ్లు సంభవించాయి. ఢిల్లీ పేలుళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఉగ్రవాదులు అందరూ అల్ ఫలాహ్ యూనివర్శిొటీకి చెందినవారే. ఇక్కడి డాక్టర్లే ఉగ్రవాదులగా మారి బాంబు పేలుళ్ళకు కుట్ర పన్నారు. ఇక్కడి నుంచే నిందితులు దాడులకు కుట్ర చేసినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. దాంతో పాటూ NAAC అక్రిడిటేషన్ లేకున్నా ఉన్నట్లుగా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం విద్యార్థులను తప్పుదారి పట్టించినట్లు గుర్తించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ మేరకు అల్-ఫలాహ్ యూనివర్శిటీపై రెండు కేసులు నమోదు చేశారు. అల్ ఫలాహ్ యూనివర్శిటీలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ECIR నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అల్-ఫలాహ్ యూనివర్శిటీ, చైర్మన్ సిద్ధిఖీ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.
ఎర్రకోట ప్రాంత పేలుడు తర్వాత భద్రతా సంస్థల నిఘాలోకి వచ్చిన హర్యానాకు చెందిన అల్-ఫలా యూనివర్సిటీకి చెందిన సుమారు రూ. 140 కోట్ల విలువైన భూమి మరియు భవనాలను ఈడీ జప్తు చేసింది.