ఈ గ్రామంలో అంతా మహిళా నాయకత్వమే..
స్త్రీ అంటే కేవలం వంటింటికే పరిమితం అనుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నారీ శక్తి తన సత్తా చాటుతోంది. గృహిణిగా రాణిస్తూనే ఎన్నో అవాంతరాలను దాటుకుని ముందడుగు వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులుకు ధీటుగా పనిచేస్తున్నారు. ఇల్లాలిగా, వ్యాపారవేత్తగా, ఆర్మీ, నేవీ రంగాల్లో కూడా పని చేస్తూ నారీమణులు భేష్ అనిపించుకుంటున్నారు..మగువలకు అవకాశం ఇవ్వాలేగాని అభివఈద్ధిలో నడిపించడం అనేది వారిసొంతం..అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని తమ నాయకత్వంతో వారి గ్రామాన్ని ముందుకు తీసుకెళుతున్నారు అక్కడి మహిళలు. ఎందుకంటారా…. ఎందుకంటే ఆ ఊరిలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, స్కూల్ టీచర్స్, హాస్పిటల్లో కూడా అందరూ మహిళలే విధులు నిర్వర్తిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని చిఖల్వావ్ అనే ఊరిలో ఈ విధంగా అన్ని రంగాల్లో మహిళలే సారథ్యం వహిస్తూ, సాధికారత దిశగా పయణిస్తున్నారు.
ఈ చిఖల్వావ్ అనే గ్రామం గుజరాత్ లోని తాపి జిల్లా, వ్యారా అనే తాలుకాకి చెందింది. ఈ ఊరిలో సుమారు 1500 మంది జనాభా నివసిస్తున్నారు. అందులోనూ గిరిజనుల జనాభానే అధిక్యం. వీరు ఎక్కువగా వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి జీవనం సాగిస్తారు. అయినా ఈ గ్రామంలో అక్షరాస్యత రేటు చాలా ఎక్కువగానే ఉంది. అందరికీ అన్నింటిపైనా అవగాహన ఉంది. పురుషులతో పాటుగా మహిళలకు కూడా అవకాశాలివ్వాలనే సదుద్దేశంతో ఇలా ఇలా తమ గ్రామాన్ని పాలించడానికి గ్రామస్థులంతా కూడా ఏకాభిప్రాయంతో నారీమణులనే ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. మహిళలు కూడా తమ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్నారు.వారి నాయకత్వంతో ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికి చేరి, గ్రామం అభివృద్ధి పథంగా అడుగులు వేస్తోంది.
ప్రభుత్వ ప్రయోజనాలు అందరికీ చేరుతున్నాయి…
ఈ గ్రామంలో మొత్తం 1501 జనాభా నివసిస్తుండగా, ఇందులో పురుషుల సంఖ్య 738, మహిళల జనాభా 773. ఈ గ్రామంలో గత గత 4 సంవత్సరాలుగా మహిళలే అన్ని పనులను నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులు కూడా మహిళలే. ఈ ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అందులోని ప్రధానోపాధ్యాయురాలు సైతం ఒక మహిళే. గ్రామ సేవకుడు, తలతిగా కూడా మహిళలే విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ప్రధాన వైద్యులు కూడా ఒక మహిళే. ఈ ఊరి అతివలు ఎంతలా పని చేస్తున్నారంటే, ప్రభుత్వ పథకాలైనా ఇతర ప్రయోజనాలైనా, అవి ప్రతి ఇంటికి చేరుతాయి.
గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడి మహిళలకు పూర్తిగా సహకరిస్తారు.పురుషులతో పాటుగా మహిళలకు కూడా సమాన హక్కులు లభించినప్పుడు, వారు కూడా తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించగలరు. అందుకు ఉదాహరణగా మనం ఈ చిఖల్వావ్ గ్రామం ని చెప్పవచ్చు. వారు వారి గ్రామ వఈద్ధి కోసం ఇక్కడి మగవారు సైతం మహిళలకు గౌరవాన్ని ఇస్తూ, సమాన హక్కులను, హోదాలను ఇవ్వడానికి నిర్ధారించుకున్న గ్రామస్తుల తీరు అభినందనీయం. ఇలాంటి మరెన్నో గ్రామాలు మనదేశంలో ఉంటే అభివఈద్ధికి లోటే ఉండదు.