ఆరెస్సెస్ విజయ దశమి ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాంనాథ్ కోవింద్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయ దశమి ఉత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రకటించింది. ఈ విజయ దశమితో ఆరెస్సెస్ కార్య శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ రెండో తేదీన నాగపూర్ లోని రేషంబాగ్ లో ఉదయం 7:40 నిమిషాలకు ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ స్వయంసేవకులనుద్దేశించి మార్గదర్శనం చేస్తారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 1925 లో విజయదశమి రోజునే కేశవ రాం బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. ప్రతి సంవత్సరం విజయ దశమి సందర్భంగా సరసంఘచాలక్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వివిధ రంగాలల్లో పనిచేస్తున్న, పనిచేసిన వారిని ముఖ్య అతిథిగా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. గత విజయ దశమి ఉత్సవానికి ఇస్రో మాజీ చైర్మన్, పద్మభూషణ్ డా. కె. రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సంవత్సరం మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను ఆరెస్సెస్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *