నరస్యాభరణం రూపమ్
రూపస్యాభరణం గుణమ్
గుణస్యాభరణం జ్ఞానమ్
జ్ఞానస్యాభరణం శౌర్యమ్
భావం : మానవులకు ఆభరణం రూపం, రూపానికి ఆభరణం సుగుణం, సుగుణానికి ఆభరణం జ్ఞానం, జ్ఞానానికి ఆభరణం శౌర్యం. శౌర్య పరాక్రమాలు, విజయేచ్ఛ లేని జ్ఞానం ఉండి నిష్ప్రయోజనం అని దీని అర్థం.