జూలై 3 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం…
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర తేదీలు ఖరారయ్యాయి. జూలై 3 నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో శ్రీ అమర్ నాథ్ ఆలయ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే యాత్ర తేదీలు ఖరారయ్యాయి. అనంతనాగ్ జిల్లాలోని పహల్ గామ్ మార్గం, గాందర్ బల్ జిల్లాలోన బాల్టాల్ మార్గాల నుంచి ఒకేసారి జూలై 3 న అమర్ నాథ్ యాత్ర ప్రారంభమవుతుందని, ఆగస్టు 9 న ముగుస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. యాత్రకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, సాఫీగా సాగేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఇక… అమరనాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాబోయే నెలలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. యాత్ర సందర్భంగా భద్రతా సౌకర్యాలు, వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాలపై కూడా దృష్టిపెడతామన్నారు.