ఈ నెల 15 నుంచి అమరనాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు అమరనాథ్ క్షేత్ర బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే.. ఈ సందర్భంగా యాత్రికులు తప్పనిసరిగా తమ ఆరోగ్య ధ్రువ పత్రాన్ని సమర్పించాలని సూచించింది. జమ్మూ కశ్మీర్ బ్యాంకు, ఎస్ బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్ బ్యాంక్ కి సంబంధించి దేశ వ్యాప్తంగా వున్న 554 శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

బోర్డు నిబంధనల ప్రకారం పదమూడు సంవత్సరాల లోపు పిల్లలు, డెబ్బై సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు అనుమతి ఉండదు.అలాగే ఆరు వారాలకు మించిన గర్భంతో ఉన్న మహిళలు దరఖాస్తు చేయరాదు. యాత్రికులు ఐదుగురు నుంచి ముప్పై మంది వరకు సమూహంగా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *