నిజామాబాదు పసుపు ప్రపంచమంతా ఎగుమతి అవుతుంది : అమిత్ షా

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం లాంచ‌నంగా ప్రారంభించారు. అలాగే పసుపు బోర్డు కార్యా లయంలో ఏర్పాటు చేసిన పసు పు ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్‌ గ్రౌండ్ ​లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనం సభలోప్రసంగిస్తూ నిజామాబాద్‌ రైతులు పసుపుబోర్డు కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. దేశ ప్రజలను ఆరోగ్యంగా వుంచడంలో పసుపు రైతులు కీలక పాత్ర వహిస్తున్నారన్నారు.

తెలంగాణ రైతుల అభ్యున్నతికి, పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.నిజామాబాదు పసుపుకు ప్రపంచ మార్కెట్లో గొప్ప పేరుందని చెబుతూ దాని ప్రాధాన్యతను మరింత పెంచాల్సి ఉందని తెలిపారు. పసుపు కేవలం ఒక పంట కాదని, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న ఒక దివ్య ఔషధమని ఆయన కొనియాడారు.

“2030 సంవత్సరం నాటికి ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,300 కోట్లు) విలువైన పసుపు ఉత్పత్తులను భారతదేశం నుంచి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ బోర్డు ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ అందిస్తామని, తద్వారా దిగుబడి, నాణ్యత పెంచేందుకు తోడ్పడతామని అమిత్ షా వివరించారు.

నిజామాబాద్‌ రైతులు పండించిన పసుపు భవిష్యత్‌లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుందని, పసుపుబోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని ఆయన చెప్పారు. భారత్‌ ఆర్గానిక్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎక్స్‌పోర్టు లిమిటెడ్‌ కూడా నిజామాబాద్‌లోనే ఏర్పాటవుతున్నాయని వివరించారు. భారత్‌ ఎక్స్‌పోర్టు లిమిటెడ్‌తో నిజామాబాద్‌ పసుపు అమెరికా, యూరప్‌కు ఎగుమతి అవుతుందని అమిత్ షా వెల్లడించారు.

బోర్డు వల్ల రైతులకు వచ్చే లాభాలు

ఇప్పుడు ఆ కల నిజమైంది. కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇది దేశంలో మొదటిసారి పసుపు పంటకే ప్రత్యేకంగా ఏర్పాటైన బోర్డు కావడం గమనార్హం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా బోర్డును ప్రారంభించగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా కార్యాలయాన్ని ప్రారంభించారు.

పసుపు ధరలకు మద్దతు

ఇప్పటివరకు రైతులు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి వద్ద సహాయం తీసుకోవాలో తెలియక తికమక పడేవారు. ఇకపై పసుపు బోర్డు ద్వారా మార్కెట్ సమాచారం, ఎగుమతి అవకాశాలు, మద్దతు ధరలు వంటి అంశాలపై తేలికగా సమాచారం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోర్డు మార్కెట్‌లో పసుపు ధరలను స్థిరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది.

సాగు విధానాల్లో మార్పు, శిక్షణ

బోర్డు రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ ఇవ్వనుంది. పసుపు నాణ్యత పెరిగేలా, దిగుబడులు మెరుగుపడేలా నూతన విత్తనాలు, పద్ధతులు ప్రవేశపెడతారు. రైతులు శాస్త్రీయంగా పంట సాగు చేయడం ద్వారా మంచి ధరలకు అమ్మే అవకాశముంటుంది. ఇలా పసుపు బోర్డు ఆధ్వర్యంలో రైతుకు శిక్షణతో పాటు సాంకేతిక సహాయంతో సాగు మెరుగవుతుంది.

ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతుల పెంపు

పసుపును కేవలం పచ్చడి లేదా వంటలకే కాదు, ఔషధంగా, కాస్మెటిక్స్‌లో, హెల్త్ ప్రాడక్ట్స్‌లోనూ విస్తృతంగా వాడుతున్నారు. ఈ అవసరాన్ని గుర్తించిన బోర్డు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇలా చేస్తే రైతులు తక్కువ ధరకు అమ్మకాలు చేయాల్సిన అవసరం లేకుండా, ప్రాసెసింగ్ ద్వారా అధిక విలువలతో అమ్మే అవకాశముంటుంది. అంతేకాదు, విదేశాలకు ఎగుమతులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మద్దతు ఇవ్వనుంది.

రైతు సమస్యలపై నేరుగా స్పందన

పసుపు సాగుతో సంబంధం ఉన్న సమస్యలు.. నీటి కేటాయింపు, ఎరువుల కొరత, కరెంటు సమస్యలు, మార్కెట్ లింకులు.. ఇవన్నింటినీ పసుపు బోర్డు నేరుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను వహిస్తుంది. గతంలో ఇవన్నీ రైతులకు భారంగా ఉండేవి. ఇప్పుడు మాత్రం సమస్యల పరిష్కారానికి ఓ అధికారిక వేదిక వచ్చింది.

ఉపాధి అవకాశాలు, గ్రామీణాభివృద్ధి

పసుపు బోర్డు వల్ల ప్రాసెసింగ్ యూనిట్లు, నిల్వ గోదాములు, ప్యాకేజింగ్ కేంద్రాలు ఏర్పాటు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. యువతకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఉపాధి దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఇలా పసుపు ద్వారా ప్రత్యక్షంగా రైతులకు, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కలుగుతుంది.

పసుపు రైతుల గౌరవం పెరుగుతుంది

ఇప్పటి వరకు ఇతర పంటలపై బోర్డులు ఉండేవి. కానీ పసుపుకూ బోర్డు ఏర్పాటు కావడంతో రైతుల్లో గర్వం, నమ్మకం పెరిగింది. మనకూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనే భావన రైతుల్లో బలంగా కనిపిస్తోంది. ఇది మానసికంగా రైతులను బలోపేతం చేస్తుంది. నిజామాబాద్ పసుపు బోర్డు ద్వారా పసుపు రైతుల జీవితాల్లో పెద్ద మార్పు రానుంది. మార్కెట్ మద్దతు, శిక్షణ, ఎగుమతులు, ప్రాసెసింగ్, సమస్యల పరిష్కారం వంటి అన్ని అంశాల్లో బోర్డు కీలక పాత్ర పోషించనుంది. ఇది కేవలం ఒక కార్యాలయం కాదు.. ఇది పసుపు రైతుకు న్యాయం చేసే ఒక కేంద్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *