సనాతనానికి కుంభమేళా అపూర్వ చిహ్నం : అమిత్ షా
మహా కుంభమేళా సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. వారి కుటుంబ సభ్యులు కూడా పుణ్య స్నానాలు చేసి, పూజలు చేశారు. తర్వాత హిందువులు పవిత్రంగా పూజించే ప్రాచీన అక్షయ్ వాత వృక్షం వద్ద పూజలు చేశారు. తదనంతరం దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహా స్వామి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అలాగే అవదేషానంద్‌గురూజీ మహరాజ్, తదితర స్వాములను కలుసుకుని వారి ఆశీర్వాదాలు పొందారు. ఆయనతోపాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు బాబా రామ్‌దేవ్ తదితరులు పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ సనాతన సంప్రదాయ ఆధ్యాత్మికతకు మహాకుంభమేళా అపూర్వమైన చిహ్నమని అభివర్ణించారు.