ఆర్టికల్ 370 పునరుద్ధరణకు ఛాన్సే లేదు : అమిత్ షా
అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 ని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని ప్రకటించారు. గాంధీల నాలుగో తరం వచ్చి అడిగినా ఆర్టికల్ 370 ని పునరుద్ధరించే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అలాగే తాము వున్నంత వరకూ మత ప్రాతిపదికన రిజర్వేషన్లను సైతం అమలు చేయనివ్వమని స్పష్టం చేశారు. మరోవైపు ఇదే అంశంపై జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర రగడ జరిగింది. ఆఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను పునరుద్ధరించాలన్న తీర్మానంపై ఈ వివాదం నెలకొంది. ఎమ్మెల్యే షేక్ కుర్షీద్ అహ్మద్‌ను మార్షల్స్ ద్వారా అసెంబ్లీ నుంచి బయటకు పంపారు. బీజేపీకి చెందిన సునీల్ శర్మ ప్రసంగిస్తుండగా… అవామీ ఇత్తెహాద్ పార్టీకి చెందిన షేక్ కుర్షీద్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను పునరుద్ధరించాలని రాసున్న బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వెల్‌లో నిలబడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంటనే దాన్ని లాక్కుని చించివేశారు.