శరణార్థులకు కచ్చితంగా పౌరసత్వం ఇస్తాం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో బెంగాల్‌ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చిన శరణార్థులందరికీ పౌరసత్వం కచ్చితంగా ఇస్తాం. ఎలాంటి భయభ్రాంతులకు లోనుకాకుండా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోండి. అందరికీ పౌరసత్వం ఇస్తాం. ఈ దేశంలో నాకు వున్నంత హక్కు మీకు కూడా వుంది. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం మా ప్రభుత్వం నిబద్ధతతో వుంది. సీఏఏ చట్టాన్ని మేం ఆమోదించాం. ఈ విషయంలో సీఎం మమత ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. సీఏఏ కోసం దరఖాస్తు చేస్తే, పౌరసత్వం కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఏఏ ప్రకారం భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని శరణార్థులను కోరుతున్నాం.

-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *