మోదీ హయాంలో చైనా అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో చైనా దేశం భారత్‌కి చెందిన అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు. చైనా దురాక్రమణ సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ అసోం, అరుణాచల్ ప్రదేశ్‌కి బైబై చెప్పారు . ఈ విషయాన్ని ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. తమ ప్రభుత్వం బంగ్లాతో దేశ సరిహద్దును సురక్షితం చేసి చొరబాట్లను నిలిపేశాం. ఈ యేడాది ప్రారంభంలో తూర్పు లడఖ్‌లో చైనాతో నెలల తరబడి సాగుతున్న సైనిక ప్రతిష్ఠంభనలో భారత్ ఇంచు భూభాగాన్ని కూడా కోల్పోలేదు.
-కేంద్ర హోం మంత్రి అమిత్ షా