కోయంబత్తూరులో భక్తి మహాకుంభమేళా జరుగుతోంది : అమిత్ షా

కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ లింగానికి అభిషేకాలు, దీపారాధనతో చేశారు. ఇక… సంప్రదాయంగా వస్తున్న సాయంత్రం జరిగిన వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గీవాసుదేవ్ తో కలిసి అమిత్ షా అభిషేకం చేశారు. ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళంలో తాను మాట్లాడలేకపోతున్నానని, క్షమించాలన్నారు. మహా శివరాత్రి రోజు శివుని దర్శనం లభించిందని, సద్గురుకి ధన్యవాదాలు తెలిపారు. ప్రయాగరాజ్ లో కుంభమేళా ముగుస్తోందని, కోయంబత్తూరులో భక్తి మహా కుంభమేళా జరుగుతోందని అభివర్ణించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత శివత్వమే అంతిమ లక్ష్యమని గ్రహిస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *