చెట్ల కోసం ప్రాణాలిచ్చిన అమృతాదేవి

దేశంలో పర్యావరణ పరిరక్షణకు ఎంతో మంది కృషి చేశారు. చాలామంది ప్రాణాలు కూడా అర్పించారు. వారిలో రాజస్థాన్‌ ‌ప్రాంతంలోని జోద్‌పూర్‌ ‌జిల్లా ఖేజడ్లి గ్రామానికి చెందిన అమృతాదేవి ఒకరు. ఈమె ముగ్గురు కుమార్తెలు కూడా వృక్షాల పరిరక్షణ ఉద్యమంలో తల్లిని అనుసరించారు. వారి పేర్లు ఆసు, రత్ని, భాగు.

జ్యోతిపూర్‌ ‌రాష్ట్ర మహారాజు అభయ్‌సింగ్‌  ‌కొత్త రాజభవనం నిర్మాణానికి సున్నాన్ని కాల్చడం కోసం చెట్లు అవసరమయ్యాయి. అందుకోసం ఆ ప్రాంతంలో ఉండే ఆకు పచ్చని ఖేజ్రి (ప్రోసూపిష్‌ ‌సినారియ) చెట్లను నరికి సున్నాన్ని కాల్చమని సైనికులకు ఆజ్ఞాపించారు.

రాజు ఆజ్ఞ ప్రకారం బిష్ణు గ్రామంలో చెట్లను నరకడానికి  సైనికులు వెళ్లారు. ఆ ప్రాంతంలో  ఉండే పచ్చని వృక్షాలను కాపాడ డానికి అమృత దేవి చెట్లును నరకవద్దని సైనికులతో గట్టిగా వాదించి, అడ్డుపడింది. ‘అవసరమైతే మీరు నా తల నరకండి. నా తల ఒక చెట్టును కాపాడితే నాకు అదే సంతోషం’ అని సైనికులకు చెప్పింది.

సైనికులు ఆమెతోపాటు, ఆమె ముగ్గురు కుమార్తెల తలలు తీసి అడవులను నరక సాగారు.

ఈ వార్త విన్న 363 మంది విష్ణోమహిళలు  కూడా చెట్లను కాపాడటం కోసం తమ ప్రాణాలు అర్పించారు. వైష్ణో మహిళల ఆత్మబలిదాన వార్త చుట్టుపక్కల 83 గ్రామాలకు వెళుతుంది. 83 గ్రామాల నుంచి వచ్చిన చాలామంది వృద్ధులు అడవిని కాపాడడం కోసం వృక్షాలను ఆలింగనం చేసుకున్నారు. చెట్లను నరక వద్దు, మమ్మల్ని నరికి ఆ తర్వాత చెట్లను నరకండి అంటూ వేలమంది ప్రజలు ఆ చెట్లను ఆలింగనం చేసుకున్నారు. 20వ శతాబ్దంలో చిప్కో ఉద్యమంలో కూడా ప్రజలు ఇలానే చేశారు. వృద్ధులు చనిపోతే నష్టమేమీ లేదు కనుక వీరిని ఇలా పంపుతున్నారని సైనికులు అన్నారు. కానీ వాళ్ల మాటలను పట్టించుకోకుండా యువకులు, మహిళలు మొదలైనవారంతా చెట్లను రక్షించడంకోసం ప్రాణత్యాగం చేశారు.

సైనికుల నాయకుడు గిర్‌ ‌దాస్‌

‌దాస్‌ ‌నాయకత్వంలో చెట్లను నరకడానికి వచ్చిన సైనికులను ప్రజలు అడ్డుకున్నారు. దానితో తమ పనికి స్వస్తి చెప్పి సైనికులు జోద్పూర్‌కు తిరిగి వెళ్ళారు. జరిగిన విషయాన్ని మహారాజుకు చెప్పారు. రాజు చెట్లను నరికి వేసే ఆలోచనను విరమించుకున్నారు. మళ్లీ చెట్లును నరకవద్దు అని ఆజ్ఞాపించారు. అప్పటికే 363 మంది మహిళలు చెట్లను రక్షిస్తూ అమరులయ్యారు.. వీరి త్యాగాలను గుర్తించిన ప్రభుత్వం వీరి పేరుతో అమృత దేవి విష్ణు స్మృతి అవార్డు ప్రారంభించింది. అప్పటి నుండి పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే అందరికీ ఈ అవార్డు ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *