పంటకు ప్రాణం పోస్తున్న “అమృత పాణి ద్రావణం”.. కేవలం వెయ్యి రూపాయలతో అధిక దిగుబడులు

అమృతపాణి ద్రావణానికి ఒక్క సారిగా డిమాండ్‌ పెరిగింది.రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో అమృతపాణి పంటకు డిమాండ్‌ ఏర్పడిరది. అమృతపాణితో పంటను సాగు చేసేందుకే రైతులు కూడా మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఏలూరు జిల్లా నూజివీడు ఆత్మా విభాగంలో పనిచేసిన వ్యవసాయ నిపుణులు సీతారాం ప్రసాద్‌… స్థానికంగా రైతులకి అదనపు ఆదాయం వచ్చే సేద్య విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. దేశీ ఆవులతో ఏర్పాటు చేసే ఒక యూనిట్‌తో ఎకరానికి 30 వేల అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చని చెబుతున్నారు. అమృతపాణి ద్రావణంతో ఇదంతా సాధ్యమన్నారు. అసలు అమృతపాణి ద్రావణం అంటే ఏమిటి? ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం.

ఈ అమృతపాణి ద్రావణాన్ని ఇక్రిసాట్‌ సంస్థ దీనిని రూపొందించింది. నేలను సారవంతంగా మారడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ద్రావణానికి 300 లీటర్ల నీరు, 40 కేజీల ఆవుపేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, 450 మిల్లీ లీటర్ల నువ్వుల నూనె, 10 కిలోల బయోఫెర్టిలైజర్‌తో పాటు వేరుశనగ పిండి, కొబ్బరి పిండి, నువ్వుల పిండి, తెలకపిండి వీటన్నింటి మిశ్రమం అవసరం.

300 లీటర్ల నీటిలో 40కిలోల ఆవు పేడను కలపాలి. తరువాత 10 లీటర్ల గోమూత్రం పోయాలి. ఆ తర్వాత 2 కిలోల పిండి, 2 కిలోల బెల్లం, అరలీటరు నువ్వుల నూనె, 10 కిలోలు జీవన ఎరువులతో పాటు పిండిల మిశ్రమాలు కలపాలి. 300 లీటర్ల నీటిలో ఐదు రోజుల పాటు కలియదిప్పాలి. ఐదు రోజుల తర్వాతే ఈ ద్రావణం రెడీ అవుతుంది. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని పంట కాలంలో నేల మీదనే వేయాలి. పంట కాలంలో రెండు సార్లు మాత్రమే వేయాలి. పంట మీద మాత్రం వేయకూడదు. అయితే.. నేల మీద పారించాలి. ఒకవేళ పంట మీద పడినా ఇబ్బందులు లేవు. ఈ ద్రావణం మూడు రోజుల పాటు మాత్రమే వుంటుంది.

ఈ ద్రావణాన్ని నేలకు అందించడం ద్వారా భూమితో పాటు, పంటకి కూడా పోషకాలు ఏర్పడతాయి. దీని ద్వారా దిగుబడి పెరుగుతుంది. దీనికి కేవలం 1000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. చాలా మంది రైతులు రసాయనాలకు చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారని, దీని ద్వారా భూమి పాడవుతుందన్నారు. కేవలం 1000 రూపాయలతో ఈ సేంద్రీయ ద్రావణాన్ని తయారు చేసుకొని, అధిక దిగుబడులు సాధించవ్చని సీతారాం ప్రసాద్‌ వెల్లడిరచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *