అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో బీఫ్ వివాదం…

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలోని సర్ షా సులైమాన్ హాలులో భోజనంలో బీఫ్ వడ్డించాలన్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఒక్క యూనివర్శిటీలో వివాదం రేగింది. బీఫ్ వడ్డించాలన్న నోటీసుపై ఇద్దరు అధికారుల సంతకాలు కూడా వున్నట్లు చెబుతున్నారు. దీనిపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. టైపింగ్ టెర్రర్ అని పేర్కొనడం గమనార్హం. సర్ షా సులైమాన్ హాలులోని విద్యార్థుల దృష్టిలో నోటీసలు పడటంతో అసలు వివాదం బయటికి వచ్చింది. ప్రతి ఆదివారం మధ్యాహ్న భోజనంలో ‘బీఫ్ బిర్యానీ’ అందజేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ డిమాండ్ వుండటంతోనే తాము సంతకాలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అయితే.. మొదట యూనివర్శిటీ దీనిపై స్పందించలేదు. వివాదం రేగడంతోనే స్పందించింది. నోటీసులు జారీ చేసిన ఇద్దరు సీనియర్ విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *