రాజస్తాన్ అసెంబ్లీ లో మతమార్పిడి నిషేధ బిల్లు

బలవంతపు మతమార్పిడులను అరికట్టడానికి రాజస్థాన్‌ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో మతమార్పడి నిషేధ బిల్లును బిల్లును ప్రవేశపెట్టింది. చట్టవిరుద్ధమైన ఈ మత మార్పిడి నిషేధ బిల్లు, 2025 ప్రకారం, బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పిడి చేయడం వంటి చర్యలకు ఏడు నుండి పది సంవత్సరాలు లేదా జీవిత శిక్ష,₹50,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దీనిని చారిత్రాత్మక చర్యగా అధికార పార్టీ ప్రశంసిస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ ఈ చర్యను బహిష్కరించింది. రాష్ట్రంలో సాంస్కృతిక , మత సామరస్యాన్ని కాపాడటానికి ఈ చర్య అవసరమని బిజెపి శాసనసభ్యులు చెప్పారు.
రాష్ట్ర మంత్రివర్గం నవంబర్ 2024లో ఈ బిల్లు ముసాయిదాను ఆమోదించింది, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో “పెరుగుతున్న ‘లవ్ జిహాద్’ సంఘటనలను” ఆపడానికి ఇది సహాయపడుతుందని పేర్కొంది. “‘లవ్ జిహాద్’ కేసులు తీవ్రతను సంతరించుకున్నాయి, ఇది సమాజంలో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఈ చట్టం ఈ ఆచారాన్ని అరికట్టబోతోంది” అని రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోగరం పటేల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అదేవిధంగా హోం శాఖ సహాయ మంత్రి జవహర్ సింగ్ బేధం మాట్లాడుతూ, ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉందని, ఇది మత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని, కానీ బలవంతంగా లేదా మోసం ద్వారా మతమార్పిడులను నిషేధిస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *