రైతులు అడిగిందే తడువుగా సూక్ష్మసేద్య పథకం మంజూరు : ఏపీ ప్రభుత్వం నిర్ణయం
సూక్ష్మసేద్యం పథకం మంజూరు విషయంలో ఏపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు అడిగిందే తడువుగా సూక్ష్మసేద్య పథకం మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు తన వాటా మొత్తం చెల్లించగానే.. వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకం అమలు చేయనుంది. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించే క్రమంలోనే ఇలా చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అవసరమున్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కింది వరకూ ఆదేశాలు జారీ చేశారు. ఈ యేడాది 2.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అమలుకు మొదట ప్రణాళికలు వేయగా, సీఎం ఆదేశాలతో దీన్ని 7.50 లక్షల ఎకరాలకు పెంచారు. పరికరాలు సమకూర్చేందుకు 33 కంపెనీల ప్రతినిధులతో కొన్ని రోజుల క్రిందటే ప్రభుత్వం సమావేశమైంది.