ఏపీలో వక్ఫ్ బోర్డు రద్దు.. కూటమి ప్రభుత్వం నిర్ణయం
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు 47 జీవోను ఉపసంహరించుకుంది. దీని స్థానంలో 75 జీవోను ప్రవేశపెట్టింది. వక్ఫ్ ఆస్తులను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయమని మైనారిటీ సంక్షేమ మంత్రి ఫరూక్ ప్రకటించారు. గతంలోని వైసీపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును నియమిస్తూ జీవో 47 ను జారీ చేసింది. ఇప్పటి కూటమి ప్రభుత్వం ఈ జీవో 47 ని వెనక్క తీసుకుంది. గతంలో ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎన్నికపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు కూడా. దేశ వ్యాప్తంగా వక్ఫ్ ఆక్రమణలు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఏపీ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 47 న్యాయపరమైన వివాదాలకు దారితీసిందని, కొంత మంది హైకోర్టును కూడా ఆశ్రయించారని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. ఈ వివాదాస్పద జీవో 47 ను రద్దు చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించిందని, వీటి పరిష్కారానికి జీవో 75 ను విడుదల చేశామని వివరించారు. గత ప్రభుత్వ చర్యలు వక్ఫ్ బోర్డు విషయంలో చట్టపరమైన ఇబ్బందులు వచ్చాయని, ఇబ్బందులకు కూడా దారితీసిందన్నారు.