ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించేందుకు సిద్ధం : మంత్రి అచ్చెన్నాయుడు
తమ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై ఆసక్తి చూపిస్తున్న ఇండోనేషియా, శ్రీలంక, జాంబియా, రువాండా దేశాలకు ఛాంపియన్ రైతుల్ని పంపి, సాంకేతిక మద్దతు అందించేందుకు రైతు సాధికార సంస్థ సిద్ధంగా వుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయానికి గుల్బెంకియన్ అందుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్వవసాయ విధానాల్ని 45 దేశాల ప్రతినిధులు పరిశీలించడం గర్వకారణమన్నారు. 15 రాష్ట్రాలకు ఛాంపియన్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌ను పంపి, అక్కడ ప్రకృతి వ్యవసాయానికి నాంది పలికామని అచ్చెన్నాయుడు తెలిపారు.