కాశ్మీర్ లో పండే ఆపిల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో
హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి అద్భుతం సృష్టిస్తున్నాడు. కేవలం శీతల ప్రాంతాల్లోనే పండే యాపిల్ పంటను ఉష్ణంగా వుండే మండలంలోనూ పండిస్తున్నారు. యాపిల్ పంట కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి చల్లటి వాతావరణంలోనే పండిస్తారు. అయితే… ఏపీలోని లంబసింగి ప్రాంతం అత్యంత చలిగా వుంటుంది కాబట్టి, అక్కడ పండిరచేవారున్నారు. కానీ… హైదరాబాద్ లాంటి ఉష్ణ మండల ప్రాంతాల్లోనూ పండిరచాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన బీహెచ్‌ఈఎల్ రిటైర్డ్ మేనేజర్ కిశోర్ బాబు ఇలా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం ఈదులపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తొలిసారి ఈ యాపిల్ సాగును చేపట్టారు. ప్రస్తుతం ఇది పూత దశలో వుందని ఆయన తెలిపారు.