ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులకు అప్లికేషన్ ఆహ్వానం

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం లో రెండు సంవత్సరాల ఉద్యాన డిప్లమా కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు సంవత్సరాల వ్యవధి గల ఉద్యాన డిప్లమాలో ప్రస్తుతం మన ఉద్యాన పాలిటెక్నిక్ మఱ్ఱి గూడ లో(మాల్) 40 విద్యార్థుల కు అనుమతి ఉంది. అప్లికేషన్లు జూలై 31 వరకు స్వీకరిస్తారు. జులై 31న మొదటి కౌన్సిలింగ్ యూనివర్సిటీలో నిర్వహిస్తారు.

 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పాలీసెట్-2024 లేదా పదో తరగతి పాస్ లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు డిప్లమాకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్ – 2024 ర్యాంకు లేదా దానికి సమానమైన పరీక్ష ద్వారా ప్రతిభ ఆధారంగా విద్యార్థుల అడ్మిషన్లు ఉంటాయి. 31.12.2024 నాటికి కనీసం 15 సంవత్సరాలు, గరిష్టంగా 22 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 60 శాతం సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగు సంవత్సరాలు చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు. మా కళాశాలలో హాస్టల్ వసతి ఉంది. *హార్టికల్చర్ పాలిటెక్నిక్ మఱ్ఱిగూడ(మాల్) ఇక్కడ విద్యార్థిని, విద్యార్థులకు కావాల్సిన బోధన, బోధనేతర సిబ్బందితో పాటు హాస్టల్ వసతి, ప్రయోగశాలలు, తోటల విస్తీర్ణం ఉన్నది.హైదారాబాద్ కు60km దూరంలో మఱ్ఱి గూడ ఉంటుంది. సాగర్ రోడ్ లోవెళ్తే 45km దూరంలో మాల్ వస్తుంది, మాల్ నుండి మార్రిగూడ కు 15km దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉన్నది.

 

ఉమ్మడి నల్గొండ , ఖమ్మం , పాలమూరు, వరంగల్, రంగారెడ్డి జిల్లాల విద్యార్థులకు ఇక్కడి ప్రాంగణం దగ్గరగా ఉంది. కాబట్టి ఇక్కడ అడ్మిషన్లు తీసుకుంటే వాళ్లకు అన్ని విధాల మేలుగా ఉంటుంది అని కార్యదర్శి శ్రీ. బండి సురేందర్ గారు తెలియజేసారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని పేర్కొన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యం, ఉద్యాన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో, భవిష్యత్తులో శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉద్యాన విభాగం ద్వార మానవ వనరులకు మేలైన ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి గ్రామీణ యువత ఉద్యాన డిప్లమా పూర్తి చేసినట్లయితే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. నర్సరీ మొదలుకొని చీడపీడల యాజమాన్యం, ఉద్యాన పంటల శాస్త్రీయ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల లో మెలకువలు అలాగే పంట కోత అనంతరం విలువల జోడింపు వంటి అంశాలపై విద్యార్థులకు డిప్లమా లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడుతుంది. రెండు సంవత్సరాల ఉద్యాన డిప్లమా పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యాన పరిశ్రమలు, ఆయిల్ ఫామ్ పరిశ్రమలు తో పాటు అనేక విభాగాలలో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. నేరుగా బీఎస్సీ హర్టికల్చర్ డిగ్రీలో హార్టిసెట్ ద్వారా సీటు సంపాదించవచ్చును. గ్రామ భారతి ఉద్యానపాలిటెక్నిక్ లో డిప్లొమా పూర్తి చేసిన 12 మంది ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ( హార్టికల్చర్) అడ్మిషన్ పొంది డిగ్రీ చదువుతున్నారు. విత్తన, పురుగుమందులు, ఎరువుల కంపెనీల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు అడ్మిషన్స్ కు సంబంధించి సమాచారం కొరకు
గ్రామ భారతి ఉద్యాన పాలిటెక్నిక్, మర్రిగూడ(మాల్) వారిని
క్రింది ఫోన్ నంబర్స్ లో
7989526805,
9705734202,
9398194912
లేదా వెబ్ సైట్ www.skltshu.ac.in నీ సందర్శించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *