భరతభూమి అఖండం కావాలి
ఇది నేను కోరుకున్న ఒట్టి స్వాత్రంత్యం కాదు. నేను చేపట్టిన విప్లవ ఉద్యమ లక్ష్యం ఇది కాదు. సంపూర్ణ, సమైక్య భారతదేశం కోసం నేను కలలుకన్నాను. దేశం మత ప్రాతిపదికన హిందూ, ముస్లింల పేరుతో రెండు ముక్కలైంది. శరీరంలో ఒక భాగం కోల్పోయినట్లే దేశం అంగవైకల్యంతో బలహీనపడుతుంది. భవిష్యత్తు నిరాశాజనకంగా ఉండకూడదనుకుంటే విభజన రద్దయి తిరిగి భరతభూమి అఖండం కావాలి. మునుపెన్నడూలేని విధంగా మనం శక్తిని సముపార్జించాలి. అవసరమైతే మన ప్రవృతిని మార్చుకొని సరిక్రొత్త వ్యక్తిగా రూపాంతరం చెందాలి. అపరిమితమైన శక్తిని సముపార్జించుకొన్న వ్యక్తుల సమూహం సమాజంలో కేంద్రీకృతం కావాలి. వారి హృదయాలలో భవానీమాత శ్రోతస్సూ నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఆ జ్వాల మన మాతృ భూమి నాలుగు చెరగులా ఉన్న జనులలో రగిలించాలి. అజేయమైన శక్తి భూమండాలాన్ని మొత్తం జ్ఞానసమృద్ధం చేయగలుగుతుంది.
– యోగి శ్రీఅరవిందులు