సౌదీ అరేబియాలో బయటపడిన 8000 ఏళ్ల నాటి దేవాలయం

సౌదీ అరేబియా లో 8000 సంవత్సరాల పురాతన ఆలయం తవ్వకాల్లో బయటపడింది. ఆలయ అవశేషాలను  అక్కడి పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి ససబంధించిన ఫొటోలను పురావస్తు శాఖ సోషల్  మీడియాలో షేర్  చేసింది. సౌదీ రాజధాని రియాద్‌కి నైరుతి దిశలో వున్న ఆల్ఫా ప్రాంతంలో 8000 ఏళ్ల నాటి ఆలయ అవశేషాలు  బయటపడ్డాయని పురావస్తు  శాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పురావస్తు శాఖలో ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.  ఈ అవశేషాలు  బయటపడటంతో పురాతన నాగరికతలు ఎలా వుండేదో తెలిసి వచ్చింది. అత్యంత మన్నికైన రాతితో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని, దీనిని నిర్మించిన సృష్టికర్తల  నిర్మాణ నైపుణ్యం అమోఘమని పురావస్తు  శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 

ఇక ఆలయంతో పాటు బలిపీఠాల అవశేషాలు  కూడా బయటపడ్డాయి. అంతేకాకుండా ఈ అవశేషాలు  బయటపడటంతో అల్ఫా ప్రాంతంలో పురాతనంగా వున్న వారి ఆచారాలు, పద్ధతులు, మతపరమైన వేడుకలు ఎలా జరిగేవి తెలిసి వస్తుందని  అధికారులు అన్నారు. ఈ ఆలయం ‘‘నియోలిథిక్‌’’ యుగానికి చెందిందని తెలుసవ్తంది. ముఖ్యంగా 2807 సమాధులను కూడా వెలికితీసింది . ఇవి పురాతన ఖనన పద్ధతులు, సామాజిక  నిర్మాణాలు ఎలా వుంటాయో చెప్పాయి. 8000 క్రితం ఈ ఆలయం కేంద్రంగా ప్రజలు ఎక్కువగా పూజలు చేసేవారని  ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా వుండేదని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు ఈ నాగరికత రహస్యాలను  మరింత ఛేదించడానికి పురాతన శాస్త్రవేత్తలు డ్రోన్లు, రిమోట్‌ సబన్సిసగ్‌, రాడార్‌, లేజర్‌ స్కానింగ్  లాంటి అత్యాధునిక సాంకేతికతను  కూడా ఉపయోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *