‘‘ఫోర్డ్ విలియం కాదిక… ‘‘విజయ్ దుర్గ్’’..
వలసవాద చిహ్నాలను, పేర్లను రూపు మాపే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోల్ కత్తాలోని తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైన ఫోర్డ్ విలియం పేరును భారత సైన్యం విజయ దుర్గ్ గా మార్చింది. గత యేడాది డిసెంబర్ లోనే ఈ పేరు మార్చే ప్రక్రియకు కేంద్రం నుంచి ఆమోదం లభించిందని కలకత్తా వింగ్ కమాండర్ హిమాన్షు తివారీ ప్రకటించారు. అయితే అప్పట్లో అధికారికంగా బయటకు ప్రకటన రాలేదు గానీ… అంతర్గత వ్యవస్థలు, సమాచార ప్రక్రియలో ఫోర్డ్ విలియం అని పిలవడం మానేశామన్నారు.బ్రిటీష్ వారు 1781లో చారిత్రాత్మక కోట విలియంను నిర్మించారు మరియు ఇంగ్లాండ్ రాజు విలియం III పేరు పెట్టారు. విజయ్ దుర్గ్ అనే పేరు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ తీరంలో వున్న పురాతన కోట నుంచి ప్రేరణ పొంది, ఈ పేరు పెట్టారు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్వర్యంలో మరాఠాలకు బలీయమైన నావికా దళంగా పనిచేసింది.