తిరిగి హిందూ మతాన్ని స్వీకరించిన 100 మంది

ఛత్తీస్ గఢ్ లో హిందూ సమాజానికి బలం చేకూరింది. 22 కుటుంబాలకు చెందిన 100 మంది తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో జరిగింది. ఈ సందర్భంగా అంబికాపూర్ లో భారీ హిందూ ధర్మ సభ జరిగింది. ఈ సభకి గోవర్ధన మఠానికి చెందిన స్వామి నిశ్చలానంద సరస్వతీ, ఇతర హిందూ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తిరిగి హిందూ మతంలోకి వచ్చిన వారందరికీ పూల మాలలు వేసి ఆహ్వానించారు. వీరందరూ క్రైస్తవులు చెప్పే మోసకారి మాటలకు, చేష్టలకు ఆకర్షితులై క్రైస్తవాన్ని స్వీకరించారు. కానీ అసలు విషయం తెలుసుకొని, హిందూ మతంలోకి వచ్చేశారు. రిజర్వేషన్లు, డబ్బు ఇతరత్రా విషయాల్లో ప్రలోభాలకు గురిచేసి, మతాంతీకరణలు చేస్తున్నారని వారు వెల్లడించారు.
స్వామి నిశ్చలానంద సరస్వతి జీ, ఋగ్వేద గోవర్ధన్ మఠం పీఠాధీశ్వరుడు, పూరీ, అఖిల భారతీయ ఘర్ వాపసీ బాధ్యులు ప్రబల్ ప్రతాప్ జుదేవ్‌తో కలిసి తిరిగి వచ్చిన వారికి పూలమాల వేసి స్వాగతం పలికారు. అక్రమ, బలవంతపు మతమార్పిళ్లకి వ్యతిరేకంగా, గోహత్యకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను రూపొందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మిషనరీలు ఈ బలవంతపు మతమార్పిళ్లు చేస్తున్నారని, దీంతో ముప్పు పొంచి వుందన్నారు. దీనిని అరికట్టాలన్నారు.
క్రైస్తవులు ఎక్కువగా గిరిజనులనే మతం మారుస్తున్నారని, రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు ఇప్పటికీ కాగితాలపై హిందూ మతాన్ని కొందరు ఆచరిస్తున్నారని ఈ సభకి హాజరైన వారు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *