పూజనీయ శ్రీ గురూజీ ప్రేరణదాయక సందేశాలు

2026 ఫిబ్రవరి 13 మాఘ బహుళ ఏకాదశి. ఈ రోజు శ్రీగురుజీ జయంతి. పూజనీయ శ్రీ గురుజి 1906 సంవత్సరం ఫిబ్రవరి 19 నాడు నాగపూర్ లో జన్మించారు. వారి జన్మించి 2026 సంవత్సరానికి 120 సంవత్సరాలు పూర్తవుతున్నాయి, ఇదే సమయంలో రాష్ట్రీయ స్వయంసేవ సంఘము శతాబ్ది కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సంఘానికి 33 సంవత్సరాల పాటు నిరంతరం మార్గదర్శనం చేసిన పూజనీయ శ్రీ గురూజీ జీవితానికి సంభందించిన కొన్ని విషయాలను సంఘ శతాబ్ది సమయంలో జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాము.
1940 -49 మద్యలో సంయనంతో సమస్యలు ఎదుర్కొన్న సంఘం
పరమపూజనీయ డాక్టర్ జిసంఘాన్ని ప్రారంభించటం కంటే ముందు విప్లవ సంస్థలోను కాంగ్రెస్, హిందూ మహాసభ సంస్థలలో పనిచేసారు అనేక సామాజిక కార్యక్రమాలు పాల్గొన్నారు. అప్పటికే రాజకీయాలు ఎట్లా ఉన్నాయో డాక్టర్జీ గమనించారు. ఆ విషయాలను అర్థం చేసుకున్న డాక్టర్ జి రాజ కియాలకు అతీతంగా సంఘాన్ని ఏరకంగా నిలబెట్టాలి ,ఎట్లా సంఘాన్ని కాపాడాలి అనే జాగ్రత్తలు చాలా తీసుకున్నారు. సంఘాన్ని సంఘంగా నిలబెట్టారు. గురూజీ 1940 వ సంవత్సరంలో సర్ సంఘచాలక్ గ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయానికి దేశంలో స్వాతంత్ర పోరాటంచివరి దశకు చేరుకొనేందుకు ఉధృతంగా సాగుతున్నది. దేశాన్ని ముక్కలు చేసేందుకు కూడా ప్రయత్నాలు తీవ్రంగా సాగుతున్నాయి . వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడు సంవత్సరాలకు దేశ విభజన జరిగింది దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశం నుండి విడిపోయి పాకిస్థాన్ గా ఏర్పడిన భూభాగలలో దామనకాండ సాగిపోయింది ఆ సమయం లో దేశాన్ని కపడవలసిన కాంగ్రెస్ నాయకులు ప్రేక్షక పాత్ర పోషించారు ఆ సమయంలో వరదల వస్తున్న హిందువులను కాపాడేందుకు సంఘం విశేష ప్రయత్నం చేసింది. ప్రజలు భావోద్వేగాలలో ఉన్నారు.
ఆ సమయంలో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, దేశభజన పరిణామాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పూజనీయ శ్రీ గురూజీ స్వయంసేవకులకు మార్గదర్శనం చేసి సంఘాన్ని నడిపించారు. 1948 వ సంవత్సరం గాంధీజీ హత్యజరిగింది ఆ నేరాన్ని సంఘం పై మోపి సంఘాన్ని నిషేధించారు. సంఘాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు విపరీతమైన ప్రయత్నాలు జరిగాయి. అదే సాకుగా తీసుకుని దేశంలో అంతర్యుద్ధం తీసుకువచ్చేందుకు కూడా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ వచ్చాయి. ఆ సమయంలో పూజనీయ శ్రీ గురూజీ” స్వయంసేవకులపై జరిగే దాడులకు ప్రతీకార దాడులు చేయవద్దని” పిలుపునిచ్చారు, దాంతో అంతర్గత సంఘర్షణలు వివారించారు.ఈ రోజునాకూడ దేశం అంతర్గతంగా అనేకాశవాళ్ళు ఎదుర్కొంటున్నది . ఈ మద్య కాలంలో దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు ప్రమాదకర సంకేతాలను ఇస్తున్నయీ. అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని అనిపిస్తున్నది.
రాజ్యాగం రచిస్తున్న సమయంలో శ్రీ గురూజీ సూచనలు
భారతీయ ఆదర్శాలను ముందుంచుకొనిదే దానిని అనుసరించి సమాజ రచన జరగనిదే మనం ప్రగతి సాధించలేము మనలక్ష్యం కేవలం మనవరకే గిరిగీసుకున్నదికాదు” అని అన్నారు. “విశ్వశాంతి కూడా మన లక్ష్యమే. అది మన జీవన లక్ష్యం. దానిని సాధించి తీరాలి. ఆధ్యాత్మిక జీవనాన్ని ఆధారంగా ఉంచుకొని విశ్వానికి శాంతి సందేశమివ్వడమూ, మానవాళి మొత్తానికి ఏకాత్మదర్శనం లభింప చేయడమే మన ముందున్న కర్తవ్యం” అన్నారు.
“రాజకీయాలు జాతి జీవితంలో ఒక అంశం మాత్రమే.. జీవనంలో ప్రముఖంగా చోటు చేసుకోవలసింది సంస్కృతి. . రాజకీయం సర్వస్వమనుకోవడమంటే భారతీయాత్మను విస్మరించి ఆలోచించడమే. రాజకీ యాలు వేర్పాటు ధోరణులను సృష్టిస్తాయి. అసహిష్ణుతను వ్యాపింప చేస్తాయి” అని అన్నారు.
“దేశం పేరు భారత్ అనే ఉండాలి. అదే యుక్తియుక్తం.
“నాగరీ లిపిని జాతీయ లిపిగా గుర్తించడం శ్రేయస్కరం.
“సంస్కృతాన్ని దేశ భాషగా చేయాలి. అది సాధ్యం కాకపోతే, అధిక సంఖ్యాకులు వాడే ‘హిందీ’ ని సంపర్క భాషగా స్వీకరించాలి.
“ఈ దేశంలో జన్మించిన భాషలన్నీ జాతీయ భాషలే. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భావనకే చోటు లేదు”అనిచెప్పారు.
సమాజ వికాసం కు చేయవలసిన పనులు
1) హిందూ సమాజంలో సామాజిక సమరసత, సామాజిక న్యాయం, అన్ని వర్గాల ప్రజలకు సామాజిక గౌరవం కలిగించే ప్రయత్నం వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రయత్నాల ప్రయోగం సంఘంలో అనేక సంవత్సరాల నుంచి నడుస్తూ ఒక సఫలతను సాధించింది దానిని సమాజపరంగా చేసేందుకు సంఘం సిద్ధమైందిశతాబ్ది కార్యక్రమాల లక్ష్యం కూడా అదే, ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడే సంఘం సమాజం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుతాయి అప్పుడే హిందూ హిందువుగా ఆలోచిస్తాడు వ్యవహరిస్తాడు.
2) రాజకీయాలతో సంబంధం లేకుండా సమాజానికి సంబంధించిన అన్ని సామాజిక రంగాలలో అనేక సంస్థలను ప్రారంభించి వాటిని బలోపేతం చేసేందుకు కావలసినటువంటి విధివిధానాలను తయారు చేయించారు, అట్లా ప్రారంభమైన సంస్థలే వివిధ క్షేత్రాలు
3) పూజనీయశ్రీ గురుజి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ఢిల్లీలో హోమ్ మినిస్టర్ని ప్రత్యేకంగా కలుస్తూ దేశంలో తాను తిరిగిన ప్రదేశాలలో పరిస్థితులను వారికి వివరించి చెప్తూ ఉండేవారు సమస్యలను వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉండేవారు.
పూ|| శ్రీ గురుజికి పార్లమెంటు ఉభయ సభలు శ్రద్ధాంజలి ఘటించాయి
పూజనీయ శ్రీ గురూజీ 1973 జూన్ 5వ తేదీ రాత్రి 9 గంటల ఐదు నిమిషాలకు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ సమయంలో దేశమంతా శ్రద్ధాంజలి ఘటించింది. పార్లమెంటులో కూడా పార్లమెంటుఉభయ సభల సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు ఇది ఒక అరుదైన సంఘటన బహుశా పార్లమెంట్ ఉభయ సభలలో సభ్యులు కానివారికి శ్రద్ధాంజలి ఘటించిన సందర్భం ఇదొక్కటే అయి ఉంటుంది. ఆ సమయంలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మాట్లాడుతూ ”ఈ సభలో సభ్యులు కాకపోయినా ఎంతో ప్రతిష్టావంతుడైన వ్యక్తి శ్రీగురూజీ గోల్వాల్కర్, ఆయన విద్వాంసుడు శక్తివంతమైన విశ్వాసాలు ఉన్న వ్యక్తి, కొందరు వారి మౌలిక ఆలోచనలతో విభేదించవచ్చు కానీ ఆయన తన సమర్థకులను ఎంతో గొప్పగా ప్రభావితం చేశారు” అని చెప్పారు.
ప్రపంచీకరణ గురించి మాట్లాడటం ఈరోజున ఒక ఫ్యాషన్, నిజానికి గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అంటే ఒక వ్యాపార సరళకి సంబంధించిన విషయం. ప్రపంచాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చూసే వస్తు వినిమయ విధానం. వ్యాపారం వల్ల ద్రవ్య వినిమయం జరగవచ్చు కానీ భావ వినిమయం జరగదు కనుక వ్యాపారం వల్ల విశ్వ కుటుంబం ఆవిర్భవించదు. . అందుకే గ్లోబలైజేషన్ గురించి ఫ్యాషన్ గా మాట్లాడే వారికి విశ్వమానవసౌబ్రాతృత్వం గురించి విశ్వకళ్యాణం గురించి ఆలోచించడం అంతగా తెలియదు.
హిందువులకుఆవిషయాలు తెలిసినంత ప్రపంచంలో మిగతా వారికి అంతగా తెలియదు. విశ్వకళ్యాణం మానవతా విలువలు అంటే ఏమిటో హిందుత్వం చెప్పినంతగా ఇంకెవరు చెప్పలేరు , కాబట్టి హిందూ సమాజాన్ని సంఘటితంగా విశ్వకళ్యాణ కార్యంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి పూజనీశ్రీ గురూజీ అనేక సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చారు. ఈరోజు సంఘ శతాబ్ది సందర్భంగా ఈ పనులను వేగవంతంగా ముందుకు తీసుకు వెళ్ళేందుకు విశేష ప్రయత్నాలు చేసేందుకు సంఘం సిద్ధమౌతున్నది
స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ ఏకచిత్రాధిపత్యంగా పని చేయడం ప్రారంభించింది అనేక సమస్యలను దేశంలో సృష్టించింది ఆ సమయంలో దేశంలో అనేక రాజకీయ పార్టీలు ప్రారంభమై పనిచేయటం కూడా ప్రారంభంఅయినాయి.
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా దేశంలో రాకియ స్థిరత్వం ఇంకారాలేదు జాతీయ స్థాయిలో రెండు లేక మూడు రాజకీయ పార్టీలు శక్తివంతంగా ఉండాలి అదృశ్యం ఇంకా కనబడటం లేదు సంఘాన్ని రాజకీయ పార్టీలు తమకు ప్రత్యర్థిగానో ప్రత్యమ్నయంగానో చూస్తూ సంఘాన్ని అణిచివేసేందుకు లేకుంటే సంఘంపై దుష్ప్రచారం చేసేందుకు చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. అటువంటి పరిస్థితులను తట్టుకొని సంఘం సంఘంగా నిలబడి ఈరోజు 100 సంవత్సరాల పూర్తి చేసుకున్నది. ఈ రోజున దేశంలో సంఘం సామాజిక పరివర్తన తీసుకొచ్చేందుకు కావలసిన ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు శతాబ్ది కార్యక్రమాలను న్నది.
రాంపల్లి మల్లికార్జున

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *