సశక్త హిందూ సమాజ రూపశిల్పి డాక్టర్ హెడ్గేవార్ జీ

– రాంపల్లి మల్లికార్జున – సాహిత్య నికేతన్
[ఏ మహాపురుషుడి జీవితాన్నైనా అర్ధం చేసుకోవాలంటే వారు పనిచేసిన సమయం సమకాలీన పరిస్థితులు అర్ధం చేసుకోవాలి. ఆ పరిస్థితులలో కాలాను గుణ్యం గా చేసిన పనులను విశ్లేషించాలి, అప్పుడే వారు చేసిన పని స్వరూప స్వభావాలు మనకు అర్ధమౌతాయి. ఈ దృష్టితో డాక్టర్ జీ జీవితాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాము . డాక్టర్ జీ సమకాలీన పరిస్థితులపై వారి విశ్లేషణ , వారి పనితీరు వారి ఆలోచనలు , వారు చేసిన మార్గదర్శనం తెలుసుకొనే ప్రయత్నం చూద్దాము . ]

నాగరికతల మధ్య సంఘర్షణ కి తెర లేచిన వేళ

1857 సంవత్సరం స్వాతంత్ర సంగ్రామం తర్వాత శతాబ్దాల సంఘర్షణ కల్లోలాల నుండి దేశం లో కొంత శాంతి నెలకొన్నది అనే భావన వచ్చింది. కొద్ది విరామం దొరికింది అది కొంత కాలం ఆ కాలం దేశంతేరుకోవటానికి ఉపయోగపడింది. ఆ తదుపరి క్రమంగా అన్ని రంగాలలో భీషణ సంగ్రామం సాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ఆ సమయంలో అనేకమంది ఆంగ్ల విద్య చదువుకుని ఆంగ్లేయుల కొలువులో పనిచేస్తూ పాశ్చాత్య దేశాలను అధ్యయనం చేయటానికి ప్రయత్నం కూడా ప్రారంభించారు. ప్రారంభంలో ఆంగ్లేయ సంస్కృతి చాలా గొప్పది అనే భావంలో పడ్డారు. అధ్యయనం కొనసాగిన తర్వాత భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం వాళ్లకు క్రమంగా అర్థం కావటం ప్రారంభమైంది, భారతీయ సంస్కృతి చాలా విశిష్టమైనది అనేటువంటి స్పష్టత కొందరిలో మేధావులగ్రహించారు. . దానితో పాశ్చాత్య నాగరికతతో సంఘర్షణ చేసేందుకు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక విషయాలను సిద్ధం చేసుకోవటం ప్రారంభించారు .

ఆ సంఘర్షణ రెండు నాగరికతల మధ్య సంఘర్షణగా మారింది. . దీనికి సంబంధించిన విషయాలను ప్రముఖ చరిత్రకారుడు కే . మ్ ఫణిక్కర్ మాటల్లో చూద్దాం” అధిక శక్తి సంపన్నమైన విస్తరిస్తూ చైతన్యవంతంగా కనబడుతున్న పాశ్చాత్య నాగరికత, ప్రాచీనమైన క్షీణ దశలో స్తబ్దంగా ఉన్నట్లు కనపడుతున్న భారతీయ నాగరికత జీవన విధానానికి సంఘర్షణ ప్రారంభమైనది ఈ సమయంలో ఒకవేళ మనం నిల ద్రొక్కుకోలేకపోతే 14వ శతాబ్దంలో జరిగిన పరిణామాలు మళ్ళీ తిరిగి భారత్ లో చోటు చేసుకుంటాయా అనే పరిస్థితులు కనపడుతున్నాయి . ఈ పరిస్థితిలో ప్రపంచానికి మనం ఏమిఇవ్వలేని ప్రమాదకర సంకేతాలు కనబడుతున్న సమయం. ఆ సమయంలో 19 శతాబ్దం చివరి భాగం లో స్వామివివేకానంద వాణి ఉవ్వెత్తున లేచింది.’’ 1893 లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహా సమ్మేళనంలో వివేకానందుడు మాట్లాడిన విషయాలు ప్రపంచాన్ని ఆలోచనలో పడేసాయి . వివేకా నందుడు అనేక దేశాలు తిరిగి భారతీయ వేదాంతం ప్రచారం చేశారు. అదే ఆ తదుపరి అనేక కీలక పరిణామాలకు దారితీసింది. స్వాతంత్ర పోరాటం కూడా ఊపునందుకుంది. భారతదేశం లో స్వామివివేకానంద నుండి డాక్టర్ జీ వరకు సాగిన ప్రయత్నాలు చివరికి సంఘ ప్రారంభానికి దారి తీసింది.

డాక్టర్ జీ కుటుంబ నేపథ్యం

తెలంగాణా ప్రాంతంలో ఇందూరు జిల్లాలో గోదావరి, మంజీరా, హరిద్ర నదుల సంగమ స్థానం కందకుర్తి గ్రామం. .నైజాం పాలనలో ఎదుర్కొంటున్న కష్టాల నుండి బయటపడటానికి ఆ గ్రామం నుండి శతాబ్దాలకు పూర్వం వేద అధ్యయనము, శాస్త్ర అధ్యయనం వృత్తిగా గలిగిన నరహరి శాస్త్రి కుటుంబం నాగపూర్ కి వెళ్ళిపోయింది . ఆ వంశంలోని బలిరాం పంత్ కుమారుడే హిందూ సమాజ సంఘటన కోసం తన జీవితాన్ని సమర్పించుకున్న డాక్టర్ కేశవరావు. డాక్టర్ జీ 1889 సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ ఉగాది పండుగ రోజున జన్మించారు.ఈ ఉగాదికి ( పరాభవనామసంవత్సరం }వారు జన్మించి నూట ముప్పై ఏడు సంవత్సరాలు అవుతున్నది. 137 సంవత్సరాలకు పూర్వం జన్మించిన డాక్టర్జీ హిందూ సమాజ పునర్నిర్మాణానికి చేసిన ఆలోచనలు ఆచరణలు ఈ రోజుకి ఆచరణీయం. డాక్టర్ జీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ప్రారంభించటానికి ముందు దేశంలో చోటు చేసుకొన్న పరిస్థితులు ,ఆంగ్లేయులు చేస్తున్న దుష్ప్రచారాలు దేశ ప్రజల ఆలోచనలలో వస్తున్న మార్పులు ఇట్లా అనేక విషయాలను డాక్టర్ జి విశేష అధ్యయనం చేసారు . దాని ఫల స్వరూపము 1925 సంవత్సరం సంఘ ప్రారంభం. అట్లా సమాజ హితం అనే గీటురాయి మీద పని చేశారు. డాక్టర్ జీ సమకాలీన పరిస్తితులు తెలుసుకుందాం.

సమకాలీన పరిస్థితులు

శివాజీ కాలం నుంచే – మనం హిందువులం అనే భావన సమాజంలో క్రమంగా బలపడుతోంది, అందుకే శివాజీ నాయకత్వం లో హిందూ సమాజం హైందవీ స్వరాజ్ లక్ష్యంగా ముస్లిం పాలకులతో భీకర పోరాటం చేసింది .ఈ పోరాటం ఇస్లాం సామ్రాజ్యం ముగింపు, బ్రిటిష్ ఆక్రమణ కొనసాగింపు మధ్య జరిగిన పరిణామం.1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత 1859 నుండి ఈ దేశా న్ని నేరుగా బ్రిటీష్ పార్లమెంటు పాలించటం మొదలైంది. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత బ్రిటిష్ వాడికి భారతదేశం యొక్క ఆంతరిక శక్తి అర్థమైంది. ఆ అంతరిక శక్తిని బలహీనం చెయ్యాలని నిర్ణయానికి వచ్చారు. దానికి అనుగుణంగా వాళ్ళ కార్యాచరణ ప్రారంభమైనదిఅదే హిందూ సమాజంలో భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలు తీసుకొచ్చింది. అవి ఇప్పటికి కొనసాగుతున్నాయి.

ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దు కోవలసిన ఒక చారిత్రక ఆవశ్యకత హిందూసమాజనికి ఏర్పడింది. ప్రజాస్వామ్య పాలన వ్యవస్థకు అనుగుణంగా దేశంలో జాతీయతా భావాలను పునర్నిర్వచించుకోవలసిన అవసరం ఏర్పడిందిఅదే సమయంలో దేశంలో సంస్కరణ ఉద్యమాల హెూరు కూడా పెరుగుతున్నాయి . అట్లాగే కాంగ్రెస్ సంస్థకు గాంధీ నాయకత్వం వచ్చేసరికి స్వతంత్ర పోరాటం క్రమంగా రాజకీయ ఉద్యమంగా రూపుతీసుకుంది, బ్రిటిష్ పార్లమెంట్ మనదేశంలో కూడా ఎన్నికలకు తెరలేపింది. ఎన్నికల రాకోసం దేశంలో క్రమంగా పార్టీలు కూడా ప్రారంభమైనాయి. రాజకీయ అధికార రుచి దేశం. ధర్మం, సంస్కృతి గురించి ఆలోచించే స్వభావంలో తేడా తీసుకొస్తున్న వేళ అది.

తిలక్ లాంటి వారు చేసిన ప్రయత్నాలు క్రమంగా తెరమరుగు కావట ప్రారంభమైంది. అటువంటి పరిస్థితులలో ఈ దేశం హిందువులది, ఇది హిందూ రాష్ట్రము అని నిర్ద్వంద్వంగా ప్రకటించవలసిన అవసరం ఏర్పడిం సంస్కృతి ఆధారంగా ఈ దేశం యొక్క జాతీయతను నిర్వచించుకోవలసి అవసరం కూడా ఏర్పడింది. . శివాజీ గురువైన స మర్థరామదాస స్వామి ఆలోచనలు, అట్లాగే స్వామి వివేకానంద ఆలోచనల సమన్వయం డాక్టరీ ఆలోచనలో మనకు కనుబడుతోంది. ఆ ఆలోచనే వ్యక్తి నిర్మాణమే, రాష్ట్ర నిర్మాణం నిర్మాణము. దానికోసం డాక్టర్ జీ ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కార్యాచరణ ప్రారంభమైనదివారు చేసిన ప్రయత్నాలలో మూడు విషయాలు ప్రధానంగా మనకు కనబడతాయి.

1) దేశస్వాతంత్రపోరాటానికి వేదికలుగా ప్రారంభమైన సంస్థలు రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందుతున్న సమయంలో వాటిలో చోటు చేసుకొంటున్న పరిణామాలతో సంఘం రాజకీయాలు స్వతంత్రపోరాటానికి మధ్య సంతులనం సాధించవలసిన ఒక చారిత్రిక అవసరం ఏర్పడింది. దానికోసం పని చేసారు. స్వతంత్రం కోసం జరుగుతున్న ఉద్యమాలలో సంఘం ఎట్లా పాల్గొనాలి అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

2) సమీప భవిష్యత్లో సంఘము దేశమంతా విస్తరించి శక్తిమంతం కావటం కోసం దివారాత్రులు పనిచేసారు. సంఘానికి అఖిలభారత స్వరూపమివ్వగల వ్యవస్థ నిర్మాణం చేసారు, శక్తిమంతమైన పునాదులు వేశారు, ఆ పునాదులపైనే ఈ రోజు సంఘం అప్రతిహతంగా ముందుకు పోతున్నది.

3) దేశంలో ప్రారంభమైన మిగిలిన సంస్థల కార్యపద్ధతికి సంఘ కార్యపద్ధతికి ఒక మౌలికమైన తేడా దైనందిన శాఖ. శాఖద్వారా వ్యక్తిపరివర్తన. దానిలోకూడా డాక్టర్ జీ నాగపూర్ మోహితేవాడలో ప్రారంభించిన శాఖ. ఆ శాఖలో కుశపథక్ గణ విశేషమైనది. కిషోర్ వయస్సు కలిగిన ఆ గణలోని స్వయం సేవకుల ఒక క్రమవికాస స ఆ గణలోని స్వయంసేవకులు క్రమంగా వయస్సుతోపాటు ఎదుగుతూ సంఘాన్ని తదుపరికాలంలో దేశవ్యాప్తం చేసారు. ఆ శాఖా వికాసం అన్నికాలాలలో అనుసరణీయం. “జహా బాలొంకా సంగ్ వహ బాజే మృదంగ్, జహ వృద్ధిం కా సంగ్ వహా కర్చొంసే తంగ్” అనేవారు.

1920 నుండి ప్రారంభమైన ఎన్నికల రాజకీయాలు – పరిణామాలు

1885 లో ప్రారంభమైన కాంగ్రెస్ వేదిక నుండి స్వాతంత్ర పోరాటం ప్రారంభమైంది.హిందూ మహాసభ ,ముస్లింలీగ్ మొదలైన సంస్థలు ప్రారంభమై పనిచేస్తున్నాయి. ఈ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఒకప్రక్క హిందువులను భావదాస్యం లోకి నెట్టివేస్తూ మరో ప్రక్క స్వతంత్రపోరాటాన్ని ప్రక్కదారి పట్టించేందుకు ముస్లింలీగ్ ను ఎగదోసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 1920 నుండి దేశంలో పరిమితంగా ఎన్నికల రాజకీయాలు మొదలయ్యాయి . రష్యా విప్లవం తరువాత భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైంది. డాక్టర్ జి కలకత్తాలో ఉన్నసమయంలో స్వయంగా విప్లవ సంస్థలలో పనిచేసారు. నాగపూర్ కి తిరిగివచ్చినతరువాత కాంగ్రెస్ సమస్తలో ,హిందూ మహాసభలోపని చేసారు. పని చేస్తూ చేస్తూ అన్ని పరిస్థితులను అధ్యనం చేస్తూవచ్చారు. దానితదుపరి డాక్టర్ జి అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి రాజకీయాలకు అలిప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్నిప్రారంభించారు , హిందూ సమాజంలో ఒక సామాజిక శక్తి, ధార్మిక శక్తిని నిర్మాణం చేయటానికి కృషి చేశారు.

దేశ ఉజ్వల భవిష్య్తతుకు ఈర్షలతో నిండి ఉండే రాజకీయాలు ఉపయుక్తం కావని ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకొని పక్షంలో అవి దేశానికి హానికరం కూడా కావచ్చు అని డాక్టర్జీ , హెచ్చరిస్తూ ఉండేవారు. అర్ధా తురాణాం నా గురు నబంధు: కేవలం ధనాకాంక్ష కలవాడు గురువుని బంధువులను కూడా లెక్కచేయడు. కామాతురాణాం న భయం న లజ్జ కామాతురుడైన వాడికి భయము లజ్జ ఉండవు. అట్లాగే ఈ రోజున సత్తా తురాణాం న దళం, న రాష్ట్రం. పదవీకాంక్ష గల రాజకీయ నాయకుడు కి పార్టీ లెక్క ఉండదు, దేశం కూడా లెక్కలో ఉండదు.డాక్టర్జీ కాలంలోనే సంఘం పై రాజకీయ వత్తుడులు ఉండేవి. కాంగ్రెస్ కు సంఘం అంటే తీవ్రమైన అసహనం ఉండేది , హిందూమహాసభకు తీవ్రమైన అసంతృప్తి ఉండేది . ఈ రెండిటినుండి సంఘాన్ని సంఘంగా నిలబెట్టారు డాక్టర్జీ..

యుగానుకూల పరివర్తనకు దిశ చూపించిన డాక్టర్ హెడ్గేవార్

ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్న సంస్థ, అనేక మంది సంఘాన్ని అధ్యయనం చేస్తున్నారు. మన దేశంలో సంఘాన్ని అభిమానించే వాళ్ళు, సంఘాన్ని విమర్శించే వాళ్ళు, సంఘం అంటే తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగిననాళ్లు అనేకమంది కనబడుతూఉంటారు సంఘాన్ని వ్యతిరేకించేవాళ్ళు దేశంలో కూడా దేశంలో అనేకమంది కనబడుతుంటారు. సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలకు వాళ్లలో కూడా సంఘం చేస్తున్న ఈ పనిని మేము సమర్ధిస్తాం అని మాట్లాడేవాళ్లు, సంఘం యొక్క క్రమశిక్షణ, నిబద్దతను చూసి సిద్ధాంతపరంగా సంఘానికి బద్దశత్రువులు కూడా సంఘానికి సహకరిస్తున్న వాళ్లు అనేకమంది దేశమంతా కనబడుతుంటారు. కొంతమందికి సంఘం అంటే ముస్లిం వ్యతిరేకి అనే భావంఉన్నది అది సంఘం ప్రారంభించిన నాటినుండి ప్రచారం జరుగుతూనే ఉన్నది. ఇది కాకుండా ఇంకా ఏదైనా అంశం మాట్లాడుతారా అంటే మరేదీ వాళ్లకు కనబడదు. ముస్లిం వ్యతికే అనే అసత్య ప్రచార అంశాన్ని ప్రక్కనపెట్టి సంఘం ఏమిచేస్తున్నది అనిఎవరైనా ఆలోచిన్న సంఘం వాళ్లకు అర్థమౌతుంది.

కాల పరీక్షలో నిలబడ్డ సంఘం

1920 నుండి ప్రారంభమైన సిద్ధాంతాలు , ఉద్యమాలు పరీక్షలకు, సమీక్షలకు, వైఫల్యాలకు లోనై కొట్టుకుపోయాయి. సిద్ధాంత వ్యాప్తికి కాకుండా సైద్ధాంతిక ఆధిపత్యం కోసం సాగిన సంఘర్షణలు బలహీనం కావటంలక్ష్య విహీనం కావటం అంతటా కనబడుతున్నది. సమాజం పట్ల, అణగారిన వర్గాల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించేవారు ఒక మూసలో ఇమడలేకపోతున్నారు. ఇదంతా దేశo నా ణి కి ఒకప్రక్క దృశ్యం , మరోప్రక్కడాక్టర్ జీ ప్రారంభించిన సంఘం దేశమంతా విస్తరించి దేశంలో మార్పు తెసుకొని వస్తున్నది. రకరకాల భావజాలాల అనుయాయులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆర్ఎస్ఎస్ విస్తరిస్తుండడం, దాని అనుబంధ సంస్థలు దేశమంతా శక్తి వంతంగా పనిచేస్తుండటంవిశేషం . . సంఘం శతాబ్ది సంధర్భంగా దేశంలో సామాన్యుల నుండి అసమాన్యుల వరకు అందరినీ కలుస్తూ మాటలాడుతూ సమాజ సేవలో భాగస్వామ్యం చేసేప్రయత్నాలు చేస్తున్నది.

జీవితం యొక్క సార్థకత

ఏ వ్యక్తి అయినా అతని జీవితం యొక్క సార్థకత ఆయన ఎంత కాలం జీవించారుఅనే దానిపై కంటే ఆయన అనుకున్న లక్ష్యం సాధించాడా అనే అంశంపైన ఆధారపడి టుంది, ప్రతివ్యక్తి తన సామర్థ్యాన్ని కల్పనాశక్తిని అనుసరించి కర్మపథంలో ముందుకు పోతూ ఉంటాడు . తన కార్యపద్ధతి, వ్యక్తిత్వంతో, సమాజంమీద, రాష్ట్రం మీద, జాతీయ జీవన ప్రవాహంమీద ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి చరిత్ర పుటలలోమనకు కు కనబడతాడు, అతని తరువాత తరాలవాళ్ళు అతనిని ఒక ఆదర్శంగా కూడా స్వీకరిస్తూ ఉంటారు. ప్రేరణ పొందుతూ ఉంటారు. డాక్టర్ హెడ్గేవార్ తాను ఎంచుకున్న మార్గం ద్వారా హిందూ రాష్ట్రానికి , నాగరికతకు, సంస్కృతికి ఒక గుర్తింపు నిచ్చారు, దాని ఫలస్వరూపమే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *