ఆపరేషన్ సిందూర్ పై తప్పుడు వ్యాఖ్యలు… ప్రొఫెసర్ అరెస్ట్
ఆపరేషన్ సిందూర్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్మదాబాద్ అరెస్టయ్యారు. హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రం విభాగానికి అధిపతిగా కొనసాగుతున్నాడు.పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇస్లామిక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి, ధ్వంసం చేసింది. అయితే ఈ చర్యను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ అలీఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ ను బీజేపీ యువజన విభాగం నేత గమనించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే హర్యానా మహిళా కమిషన్ కూడా ఈయనకు నోటీసులు పంపింది. తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.కల్నల్ సోఫియా ఖురేషీకి ‘‘రైట్ వింగ్’’ నుంచి కూడా మెచ్చుకోళ్లు వస్తున్నాయని అన్నాడు. అదే వ్యక్తులు మూక దాడులను సమర్థిస్తారని, అలాగే ఏకపకక్షంగా కూల్చేస్తారంటూ కూడా కామెంట్స్ పెట్టారు.మరోవైపు ఆపరేషన్ సిందూర్ పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వల్లే ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశామని హర్యానా ఏసీపీ అజీత్ సింగ్ ప్రకటించారు.