దేశ వ్యాప్తంగా 100 అమృత్ రైళ్లు: అశ్వనీ వైష్ణవ్

2026లోపు దేశమంతా కవచ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ముఖ్య స్టేషన్ల పరిధిలో కవచ్‌ టెక్నాలజీని వేగంగా ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో అన్ని చోట్ల పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే.. సికింద్రాబాద్‌లో కవచ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా 100 అమృత్‌ భారత్‌ రైళ్లు కూడా వస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 200 వందే భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ఆటోమేటిక్ రైలు రక్షణ టెక్నాలజీ కవాచ్‌ను అమలు చేస్తామని తెలిపారు. 2026 నాటికి కవాచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని.. రైల్వే భద్రత కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఇండియన్ రైల్వే కోసం 2.52 లక్షల కోట్లను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *