కరీంగంజ్ కాదిక… అది ‘శ్రీభూమి‘… అసోం నిర్ణయం
అసోం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి కరీంగంజ్ జిల్లా పేరును ‘‘శ్రీభూమి’’ గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ భూమి అంటే లక్ష్మీ దేవి భూమి అని తెలుగులో అర్థం. ఇక నుంచి కరీంగంజ్ ను శ్రీభూమిగా పిలుస్తామని సీఎం హిమంత బిస్వ శర్మ ప్రకటించారు.దీనికి కేబినెట్ కూడా ఆమోదించిందని ప్రకటించారు. ఇప్పటికే తాము వివిధ జిల్లాలోని అనేక గ్రామీణ ప్రాంతాలకు తాము పేరు మార్చామని తెలిపారు. క్రమ క్రమంగా పేర్లను మారుస్తూ వుంటామన్నారు.
అసలు అర్థంపర్థం లేని పేర్లున్న గ్రామాల పేర్లను మారుస్తామన్నారు. కరీంగంజ్ అన్న దానికి అస్సామీ, బెంగాలీ నిఘంటువుల్లో అర్థమే లేదని దెప్పిపొడిచారు. కానీ… శ్రీభూమి అన్న పదానికి అర్థం వుందన్నారు. అంతేకాకుండా విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ కూడా ఈ కరీంగంజ్ ని శ్రీభూమి అని పేర్కొన్నారనిస సీఎం హిమంత గుర్తు చేశారు.