బీఫ్ నిషేధిస్తూ అసోం ప్రభుత్వం కీలక ప్రకటన
అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీఫ్ (గొడ్డుమాంసం) ని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసోంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రాంతాల్లో బీఫ్ విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించారు. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తాయని హిమంత బిస్వ శర్మ ప్రభుత్వం ప్రకటించింది.’రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వడ్డించడం, వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం” అని ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ ప్రకటించారు.
అయితే… రాష్ట్రంలో బీఫ్ వినియోగానికి సంబంధించి ప్రస్తుతం వున్న చట్టం బలిష్టంగానే వుందని, అయితే రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు మతపరమైన, సామాజిక కార్యక్రమాల సందర్భంగా ఆ మాంసాన్ని వినియోగించడంపై ఇప్పటి వరకూ నిషేధం లేదన్నారు. ఇప్పుడు పూర్తిగా నిషేధం విధించినట్లు వివరణ ఇచ్చారు.