వనవాసులకు దుప్పట్లను పంపిణీ చేసిన వనవాసీ కల్యాణాశ్రమ్
శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వనవాసీ కల్యాణాశ్రమం ఒడిశా రాష్ట్రమంతటా వనవాసీలకు బ్లాంకెట్లను పంపిణీ చేసింది. వృద్ధులకు, పేదలకు ఈ పంపిణీ చేశారు. వనవాసీల్లో ఆత్మనిర్భరత నింపడానికి, విద్యార్హతలు పెంచడానికి, సాంస్కృతికంగా వారిని పరిపుష్టం చేయడానికి, ఆరోగ్య సేవలు మొదలైన వాటిని అందించడానికి చాలా సంవత్సరాలుగా వనవాసీ కల్యాణాశ్రమం పనిచేస్తోందని అసోం కార్యదర్శి విశ్వమిత్ర మహంత తెలిపారు. ఈ యేడాది చలి తీవ్రత విపరీతంగా వుందని, అందుకే బ్లాంకెట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బ్లాంకెట్ల పంపిణీని వనవాసీ కార్యకర్తలు బాధ్యతతో చేశారని పేర్కొన్నారు.
మయూర్ భంజ్ జిల్ాలో, ఖుంటూ బ్లాక్ లోని శాలబాని మరియు బారాసాహి ప్రాంతాల్లో, అలాగే చంపగఢ్, లోధా, మన్కాడియాలోని వనవాసీలకు దుప్పట్ల పంపిణీ చేశారు. దీనికి కృష్ణచంద్ర భాటీ ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అలాగే దేవగఢ్ ప్రాంతంలోని ముండా వనవాసీ కుటుంబాలకు, అలాగే రియామల్ బ్లాక్ పరిధిలోని కుఝరన్, తిలీబానీ, సత్ ఖాలీ గ్రామాల్లో కూడా వనవాసీ కల్యాణ ఆశ్రమ్ సభ్యులు ప్రభాస్ మిశ్రా కొనసాగించారు. అలాగే సంబల్పూర్ జిల్లాలోని జమన్కిరా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వనవాసీలకు కూడా దుప్పట్ల పంపిణీ జరిగింది. డాక్టర్ కార్తిక్ ప్రధాన్, కృష్ణ చంద్ర భోయి మరియు స్థానిక గ్రామ నాయకుల మద్దతుతో కార్యక్రమం జరిగింది.రాయగడ జిల్లాలో, కాశీపూర్ బ్లాక్ పరిధిలోని పట్లమా, తూటీ, కాన్పూర్ గ్రామాలలోని డోంగ్రియా కొండ్ కుటుంబాలు జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రౌత్, అభిమన్యు మహంతి, గౌరీ శంకర్ పిడిసిక సహకారంతో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.