హైదరాబాద్ శివారు చంగిచర్ల గ్రామంలో హిందూ కుటుంబాలపై దాడి
భాగ్యనగర శివారు చర్లపల్లి సమీపంలోని చంగిచర్ల గ్రామంలో హోలీ వేడుకలకు సమాయత్తం అవుతున్న హిందూ కుటుంబాలపై కొంత మంది ముస్లిం మూకలు దాడికి తెగబడ్డ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మేకల మండీ ప్రాంతంలో హోలీ సందర్భంగా భక్తి పాటలు పెట్టుకుని హిందూ కుటుంబాలు వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి అభ్యంతరం చెబుతూ సుమారు 500 మందికి పైగా ముస్లిం మూకలు వారిపై దౌర్జన్యానికి దిగాయని స్థానికులు చెబుతున్నారు. దీనిని అడ్డుకోబోయిన మహిళలు, స్థానికులపై ముస్లిం మూకలు దాడికి తెగబడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. మరోవైపు.. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు, నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హిందూ కుటుంబాలపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.