గొనె సంచులు, గడ్డి నాట్లు… ప్రకృతి పద్దతిలో ఎండ నుండి కాపాడుకుంటున్న ఆటోవాలా

ఈ యేడాది ఎండ తీవ్రత విపరీతంగా వుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి వారి పనుల నిమిత్తం బయటికి వెళ్లాలంటే కూడా కష్టంగానే వుంది. కార్లు వున్న వారికి అంత ఇబ్బందులు లేవు. కానీ.. సామాన్య ప్రజానీకానికే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వీరిపైనే ఆధారపడి వున్న ఆటో రిక్షాల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆటో డ్రైవర్లు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ… తమ ఆటోలు కూల్‌ కూల్‌గా వుండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓ ఆటో డ్రైవర్‌ ఎండ నుంచి తనకు, ప్రయాణీకులకు కూల్‌ గా వుంచడానికి గోనె సంచులు కప్పాడు. ఆటోకి పూర్తిగా కప్పేసి, వాటిని నీటితో తడుపుతున్నాడు. అంతేకాకుండా గోనె సంచుల మధ్య భాగంలో గడ్డిని కూడా పెంచుతున్నాడు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది. గడ్డి నాట్ల మూలంగా కాస్త చల్లగా వుంటోందని ప్రయాణికులు కూడా ఆనందపడుతున్నారని ఆ ఆలోడ్రైవర్‌ అన్నాడు. ప్రస్తుతం ఈ కూల్‌ ఆటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఇక ఢల్లీిలోనూ పరిస్థితి ఇలాగేవుంది. దీంతో అక్కడి ఆటో డ్రైవర్లు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తూ నెటిజన్లను, ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. కుమార్‌ అనే ఆటో డ్రైవర్‌ 20 రకాల గడ్డి నాట్లను, 20 రకాల పువ్వులతో ఆటోను ప్రత్యేకంగా అలంకరించి, మూవింగ్‌ గార్డెన్‌ ఆటోగా పేరు గడిరచాడు. ప్రతి గంటకు ఒకసారి ఈ గడ్డినాట్లు, పూలపై నీళ్లు చల్లుతూ వుంటాడు. ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే వాటితో తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇంకా మరికొందరు చల్లని కూజాలను తమ వెంట వుంచుతున్నారు. ప్రయాణికులు తమ ఆటోలో ఎక్కినప్పుడు ఈ కూజా నీటిని అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *