33 లక్షల దీపాలు.. 30 వేల వాలెంటీర్లు.. ఈ సారి మరింత ప్రత్యేకంగా ‘‘అయోధ్య దీపోత్సవ్’’

దీపావళి పర్వదినం వచ్చేస్తోంది. అయోధ్య పుణ్య నగరం కూడా అందుకు రెడీ అవుతోంది. దీపావళి అంటేనే అయోధ్య, అయోధ్య అంటేనే దీపావళి… అనేంతలా ముస్తాబు అవుతోంది. పర్యావరణ హిత దీపావళి నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పవిత్రమైన సరయూ నది వెంబడి 28 లక్షల మట్టి దీపాలను వెలిగించనుంది యూపీ ప్రభుత్వం. ఒకేసారి 33 లక్షల దీపాలను వెలిగించి, ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కబోతోంది.గత యేడాది దీపావళితో పోలిస్తే, ఈసారి మరింత ఘనంగా నిర్వహించి, అయోధ్య నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక శోభను మరింతగా ప్రపంచ వ్యాప్తం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం 30 వేల మంది వాలెంటీర్లు కూడా పనిచేస్తారు. మొత్తం 56 ఘాట్ లలో 33 లక్షల మట్టి ప్రమిదలను వీరు ఏర్పరుస్తారు.
గత యేడాది దీపావళికి 25 లక్షలకు పైగా దీపాలను నది ఘాట్లలో వెలిగించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించి, రికార్డుల్లోకి ఎక్కింది అయోధ్య నగరం. ఈ యాడాది దీపావళికి ఈ రికార్డును అధిగమించి, 28 లక్షల దీపాలను వెలిగించనున్నారు. దీని ద్వారా అయోధ్య శోభ మరింత వెలిగిపోనుంది. మొత్తం 56 ఘాట్లలో దీపాలను వెలిగిస్తారు.
33 లక్షల మట్టి ప్రమిదలు.. 30 వేల మంది వాలెంటీర్లు….
ఈ సారి దీపోత్సవం కోసం 33 లక్షల మట్టి ప్రమిదలు, 30 వేల మంది వాలెంటీర్లు పనిచేయనుననారు. అలాగే ఈ దీపోత్సవ్ కోసం 33 లక్షల వత్తులను, 75 వేల లీటర్ల నూనెను వినియోగించనున్నారు. అలాగే సరిగ్గా అదే సమయానికి ఈ 33 లక్షల ప్రమిదలను వెలిగించేందుకు ఈ వాలెంటీర్లందరికీ శిక్షణ కూడా ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఫైజాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయానికి సమన్వయ బాధ్యతను అప్పగించారు. భద్రత, దీపాల లెక్కింపు మొదలు ట్రాఫిక్ నిర్వహణ, పరిశుభ్రత, మీడియా సమన్వయం, ప్రథమ చికిత్స, అలంకరణ, రంగోలీ రూపకల్పన వరకూ ప్రతి అంశాన్ని వీరు సమన్వయం చేస్తారు.
ayodhya2
దీపావళికి కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 19న దీపోత్సవ్ 2025 వేడుకలు జరగనున్నాయి. 14 సంవత్సరాల వనవాసం మరియు రావణుడిపై విజయం తర్వాత రాముడు, సీత మరియు లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు గుర్తుగా ఈ వేడుకలు జరుగుతాయి.
దీపోత్సవ చరిత్రలోనే తొలిసారిగా లక్ష్మణ్ కిలా ఘాట్ లో కూడా దీపోత్సవం జరగనుంది. ఈ ఘాట్ లో 1.25 లక్షల దీపాలను వెలిగించనున్నారు. ఇక ఎప్పటి లాగే ఇతర ఘాట్ లలో కూడా దీపాలను వెలిగిస్తారు. అద్భుతమైన లైటింగ్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రామ్ కీ పైడి, చౌదరి చరణ్ సింగ్ ఘాట్ ల వద్ద 1.5 లక్షల దీపాలు, భజన్ సంధ్యా ఘాట్ వద్ద కూడా 1.5 లక్షల దీపాలను వెలిగించనున్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు రామ్ కీ పైడి, ఇక్కడ 15 నుండి 16 లక్షల దీపాలను వెలిగించనున్నారు. వీటన్నింటి ద్వారా భక్తులను అక్కడి యంత్రాంగం మంత్ర ముగ్ధులను చేయనున్నారు. అధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు గుర్తుగా, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి గుర్తుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటి దీపాన్ని వెలిగించి, దీపోత్సవ్ 2025 ను లాంఛనంగా ప్రారంభిస్తారు.దీని ద్వారా అయోధ్య దీపోత్సవ్ వేడుక ద్వారా అయోధ్య నగరం ప్రపంచ వ్యాప్తంగా పరిచయమై, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *