జూన్ 3 నుంచి 5 వరకూ రామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ : నృపేన్ మిశ్రా
అయోధ్య ఆలయంలో జూన్ 3 నుంచి 5 వ తేదీ వరకూ రామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. జూన్ 5 న జరిగే ఈ ప్రతిష్ఠాపన మహోత్సవానికి వివిధ విశ్వాసాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలను ఆహ్వానించామని పేర్కొన్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్య వ్యక్తులను మాత్రం ఆహ్వానించడం లేదన్నారు.
జూన్ 3నుంచి 5 వరకు మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయని, ఆ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ నిర్మాణం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని.. సుమారు 500 సంవత్సరాలకు పైగా పోరాటం తర్వాత ఈ క్షణం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. జూన్ 5 నాటికి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.