ఎరువుగా శబరిమల అయ్యప్ప ప్రసాదం.. బోర్డు కీలక నిర్ణయం

ఇప్పుడు నడుస్తోంది అయ్యప్ప స్వాముల సీజన్. ఈ సీజన్ లో శబరిమల ప్రసాదానికి చాలా డిమాండ్ వుంటుంది. శబరిమల వెళ్లిన ప్రతి స్వామీ… ఈ అరవణ ప్రసాదాన్ని డబ్బాలుగా తెచ్చుకుంటుంటారు. ఇది చాలా రోజులు వుంటుంది కూడా. అయితే… ఇప్పుడు ఈ ప్రసాదాన్నే ఎరువుగా కూడా వాడుతున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ ప్రాంతంలో బాలాపూర్ లడ్డూనే రైతులు తమ పొలాల్లో చల్లుకుంటూ.. ఎక్కువ గిట్టుబాటు తెచ్చుకుంటారన్న వార్త ప్రాధాన్యంలో వుంది. ఇప్పుడు శబరిమల అయ్యప్ప ప్రసాదం కూడా ఎరువుగా రానుంది.

ఈ అరవణ ప్రసాదంలో యాలకుల్ని అధిక శాతంలో కలుపుతుంటారు. దీనిని బియ్యం, బెల్లంతో తయారు చేస్తారు. గత యేడాది ట్రావెన్ కోర్ బోర్డుకు ప్రసాదాల తయారీకి వచ్చిన యాలకుల్లో రసాయనాల శాతం బాగా వున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్పటి వరకూ తయారైన ప్రసాదాన్ని అధికారులు నిర్ద్వంద్వంగా పక్కన పెట్టేశారు. దాదాపు 8 లక్షల టన్నుల ప్రసాదాన్ని పక్కన పెట్టేశారు. అయితే.. అయ్యప్ప ప్రసాదాన్ని ఇలా వేస్ట్ చేయడం అధికారులకు నచ్చలేదు.

దీంతో ఏం చేయాలో ఆలోచించి… ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రసాదాన్ని ఎరువుగా మార్చేయాలని నిర్ణయించారు. పేద రైతులకు మాత్రమే ఈ ప్రసాద రూపంలో వున్న ఎరువును వితరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రసాదాన్ని ఓ సేంద్రీయ ఎరువులను తయారు చేసే సంస్థకు కాంట్రాక్ట్ గా దేవస్థానం అప్పగించింది. ఆ సంస్థ పేరు ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజినీరింగ్ సెల్యూషన్స్. అయితే… జిగురుగా వుండే ఆ ప్రసాదాన్ని కాంటాక్ట్ తీసుకున్న సంస్థ బాగా ఎండబెడుతుంది. ఎండిన తరువాత కొన్ని సేంద్రీయ ఎరువులను కలిపి.. ప్యాకింగ్ చేసి, పంపిణీ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *