హిందూ జాగరణ కోసం పనిచేస్తూనే వుంటా : బాబా బాగేశ్వర్ మహారాజ్
హిందువులంతా ఐక్యంగా ఉండాలని, కులం ఆధారంగా తమలో తాము పోరాడకూడదని అన్నారు బాగేశ్వర్ ధామ్ అధిపతి అయిన బాబా బాగేశ్వర్ మహరాజ్ (ఆచార్య ధీరేంద్ర శాస్త్రి)…పాట్నాలోని గాందీమైదాన్ వద్ద ప్రముఖ సాధువు రాంభద్రాచార్య అధ్యక్షతన సనాతన మహాకుంభ్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో మద్యప్రదేశ్ లోని బాగేశ్వర్ ధామ్ అధిపతి అయిన బాబా బాగేశ్వర్ మహారాజ్ (ఆచార్య ధీరేంద్ర శాస్త్రి) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు హనుమాన్ కథను చెప్పడంలోనూ, ఆధ్యాత్మిక ప్రవచనాలను ఇవ్వడంలో ప్రసిద్ధి పొందిన వారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ముస్లింలు ,క్రైస్తవులతో తనకు ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. “నేను ఏ మతాన్ని వ్యతిరేకించను, కానీ హిందువులు కులం పేరుతో పోరాడుతుండటం నాకు సమస్య. మేము ఏ పార్టీకి చెందినవాళ్ళం కాదు” అని ఆయన అన్నారు.
“కొంతమంది భారతదేశాన్ని ‘ఘజ్వా ఏ హింద్’గా మార్చాలనుకుంటున్నారు కానీ మేము దీనిని జరగనివ్వము. మేము భారతదేశాన్ని ‘భగవా ఏ హింద్’గా మారుస్తాము. మన దేశం హిందూ దేశంగా మారుతుంది . బీహార్ మొదటి హిందూ రాష్ట్రంగా స్థాపితమవుతుంది. హిందువులను మేల్కొల్పడానికి మేము కృషి చేస్తూనే ఉంటాము” అని అన్నారు. హిందువులు ఐక్యంగా ఉండాలని, కులం ఆధారంగా తమలో తాము పోరాడకూడదని ఆయన అన్నారు.
అంతేకాక బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బాబా బాగేశ్వర్ అన్నారు., నవంబర్ 7 నుండి 16 వరకు ఢిల్లీ నుండి బృందావన్ వరకు జరిగే పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతాయని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు అశ్విని చౌబే అన్నారు. “దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడానికి హిందువులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సాధువులు, పూజారులకు ఆర్థిక సహాయం అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాము” అని ఆయన అన్నారు.