ఎమర్జెన్సీ సినిమాపై బంగ్లాదేశ్ నిషేధం
కంగనా రనౌత్ నటించిన ‘‘ఎమర్జెన్సీ’’ సినిమాపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. బంగ్లాదేశ్ లో ఆ సినిమా ప్రదర్శించడానికి వీల్లేదని అక్కడి ఛాందస ప్రభుత్వం హుకూం జారీ చేసింది. ప్రస్తుత సందర్భంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి ఈ కారణంగానే ఎమర్జెన్సీ సినిమాపై అక్కడి ప్రభుత్వం బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది.అయితే… భారత్ కి సంబంధించిన చిత్రాలను బ్యాన్ చేయడం ఇదేమీ కొత్త కాదు. ఎమర్జెన్సీతోనే ప్రారంభం కూడా కాలేదు. గతంలో పుష్ప2, భూల్ భూలయ్యా 3 వంటి చిత్రాలను కూడా బంగ్లాదేశ్ లో నిషేధించారు.కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, అశోక్ ఛబ్రా, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాఖ్ నాయర్ మరియు సతీష్ కౌశిక్ నటించిన ‘ఎమర్జెన్సీ’ జనవరి 17న విడుదల కానుంది.