చిన్మయ్ కృష్ణదాస్ పై కేసు నమోదు
ఇస్కాన్ స్వామీజీ చిన్మయ్ కృష్ణదాస్ పై మత ఛాందస బంగ్లాదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో చిన్మయ్ కృష్ణదాస్ మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. దీంతో చిన్మయ్ కృష్ణదాస్ తో సహా 164 మంది అతని అనుచరులపై దేశద్రోహం కేసు నమోదైంది. హెఫాజాత్ ఎ ఇస్లాం బంగ్లాదేశ్ కార్యకర్త వ్యాపారవేత్త ఇనాముల్ హక్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 26 న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు కృష్ణదాస్ అనుచరులు తనపై దాడి చేశారని ఇనాముల్ హక్ ఆరోపించారు. దాడిలో తన కుడిచేయి, తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరానని చెప్పుకొచ్చాడు.