‘‘బెంగాల్ బ్లీడింగ్’’ పుస్తకావిష్కరణ
ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్నహింస, దాని చారిత్రక నేపథ్యం, హిందువులనే లక్ష్యంగా చేసుకొని గత 80 సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు మొదలైన విషయాలను వివరించే ‘‘బెంగాల్ బ్లీడింగ్’’ ఆంగ్ల పుస్తకాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవహ శ్రీ అరుణ్ కుమార్, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ ఆవిష్కరించారు.
భాగ్యనగరం బర్కత్‌పురా కేశవ నిలయంలో జూన్ 26న జరిగిన ఒక కార్యక్రమంలో సంవిత్ ప్రకాశన్ ప్రచురించిన ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తకం గురించి వివరించిన సంవిత్ ప్రకాశన్ డైరక్టర్ శైలజ గారు మాట్లాడుతూ దేశ విభజనకు పూర్వం, ఆ తరువాత సైతం బెంగాల్ ప్రజలు ఇస్లామిక్ జీహది శక్తులతో నిత్యం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. 1941 నుండి నేటి వరకు బెంగాల్‌తో సహ మత ప్రతిపదికన ఈస్ట్ పాకిస్తాన్‌గా, తరువాత ప్రత్యేక దేశంగా మారిన బంగ్లాదేశ్‌లో హిందువులపై అన్నీ రకాల దాడులు చేస్తూ ఒక భయానక వాతా వరణాన్ని కల్పించారని తెలిపారు. దాంతో పాటు గత ఎనిమిది దశాబ్దులుగా హిందువుల పై ఇస్లామిక్ శక్తులు, కమ్యూనిస్ట్, టిఎంసి పార్టీ వారు చేసిన దాడుల నేపధ్యాన్ని, ప్రభావాన్ని వివరించడం కోసం ఈ సంకలనం తీసుకొని రావడం జరిగిందని పేర్కొన్నారు. నేటి తరం పాఠకులు అప్పటి విషయాలను తెలుసుకునేందుకు ఈ 144 పేజీల పుస్తకం ఉపయోగపడుతుందని శైలజ గారు అన్నారు. ఈ పుస్తకంలో పాకిస్తాన్ మొదటి న్యాయ శాఖ మంత్రిగా ఉన్న జోగింద్రనాథ్ మండల్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు, ఆనాటి నేపధ్యానికి సంబంధించిన వివరాలు లభిస్తాయి. ఈస్ట్ పాకిస్తాన్ లో హిందువులపై జరిగిన జీహది శక్తుల క్రూరమైన దాడులను ప్రత్యక్షంగా చూసిన తరువాత రాజీనామా చేసిన జోగింద్రనాథ్ మండల్ ఈ విషయాలను తన రాజీనామా పత్రంలో వివరించారు కూడా.
పుస్తకం వెల రూ. 170/-
కాపీలు బర్కత్‌పుర, భాగ్యనగరంలోని ‘సాహిత్య నికేతన్’ పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంటాయి.
పుస్తకాన్ని హిందూ ఇ షాప్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.