నీటిని పొదుపు ఇలా చేయండి… వైరల్‌ అవుతున్న బెంగళూరు డాక్టర్‌ సూచనలు

బెంగళూరు… నీటి ఎద్దడితో వార్తల్లోకి ఎక్కింది. అక్కడి నీటి కొరత ప్రజలకు తీవ్ర కష్టాలను తెచ్చి పెడుతోంది. కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. బోర్లు అడుగంట పోవడం పోవడం, కాలువలు, చెరువులు ఎండిపోవడం… ఇలా తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో తాగునీటిని వృథా చేయవద్దని కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వం గానీ, సామాజిక సంస్థలు గానీ ప్రజలను కోరుతున్నాయి. తాగు నీటిని వాహనాలను కడగడం, నిర్మాణాలు, వినోద సంబంధిత కార్యక్రమాల కోసం వాడొద్దని తేల్చి చెప్పింది. అలాగే హోళీ రోజున కావేరీ, బోరుబావుల నీటిని రెయిన్‌ డ్యాన్స్‌ కోసం వినియోగించవద్దని కూడా సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా వుండే దివ్యా శర్మ అనే వైద్యురాలు నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి, నీటిని తెలియకుండా ఎలా వృథా చేస్తున్నామో చూడండి… అంటూ ఎక్స్‌ మాధ్యమం వేదికగా ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ పోస్టు తెగ వైరల్‌ అవుతోంది. ఆమె సూచించిన సూచనలేమిటో ఓసారి చూద్దాం…

 

1. బాత్‌ రూమ్స్‌లో షవర్స్‌ బంద్‌ చేయాలి. బకెట్‌ లో నీటిని పట్టుకొని మాత్రమే స్నానం చేయాలి. షవర్‌ ఆన్‌ చేస్తే చాలా నీరు వృథా అవుతుంది. పైగా ఎక్కువ సేపు నీళ్లలో వుండటం చర్మానికి కూడా అంత మంచిది కాదు. కొందరు రోజుకి రెండు సార్లు స్నానం చేస్తారు. ఒకేసారి చేస్తే వచ్చే ప్రమాదం కూడా ఏమీ లేదు.

2. మన ఇంట్లో వుండే ట్యాప్‌లకు ఎరీటర్‌లు పెట్టుకోవాలి. ట్యాప్‌ తిప్పగానే విపరీతంగా నీరు వచ్చేస్తుంది. దీంతో నీరు వృథా అవుతుంది. అలా కాకుండా మన ట్యాప్‌లకు ఎరీటర్లను బిగించుకుంటే అంట్లు తోమే సమయంలో గానీ, ఇతరత్రా సమయంలో గానీ పొదుపుగా నీళ్లు వాడే అవకాశం వుంటుంది.
3. ఆర్‌ఓల నుంచి ఫిల్టర్‌ సమయంలో వృథాగా పోయే నీటిని పట్టుకొని మొక్కలకు పోయాలి. మాప్‌ పెట్టడానికి ఉపయోగించాలి. యూ వాషింగ్‌ మిషన్‌ను ఒకటీ అరా బట్టల కోసం కాకుండా ఫుల్‌ లోడ్‌ తో ఉపయోగించాలి.
4. కార్‌ వాషింగ్‌ కు నీటిని వృథా చేయకుండా తడి బట్టలతో తుడుచుకోవాలి.
5. డిష్‌ వాషర్‌ ఉపయోగించడం వల్ల నీళ్లు తక్కువ ఖర్చు అవుతాయి. అంట్లు తోమితే 60 లీటర్ల నీళ్లు కనీసం పడతాయి. డిష్‌ వాషర్‌ లో 10 లీటర్లు సరిపోతాయి.
6.ప్లంబర్‌ని పిలిచి అన్నీ లీకులను చెక్‌ చేయించాలి.
7. పిల్లలకు నీటి విలువ తెలియజెప్పి నీళ్లు వృథా చేయకుండా చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *