ఆర్మీకి నైతిక మద్దతిచ్చిన గ్రామస్థులు.. వెనక్కి తగ్గిన బంగ్లా ఆర్మీ
బెంగాల్ లోని సుఖదేవ్ పూర్ గ్రామస్థులు యావత్ భారతానికే ఆదర్శంగా నిలిచారు. బంగ్లాదేశ్ ఆగడాలను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీఎస్ఎఫ్ కి రక్షణ కవచంలా, నైతిక మద్దతుగా నిలిచి, దేశానికి ఆదర్శమయ్యారు. అసలు ఏం జరిగిందంటే… బెంగాల్ లోని ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ పనిని బీఎస్ఎఫ్ చేస్తోంది. దీనిని బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ దళం అడ్డుకుంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీఎస్ఎఫ్ పనికి బంగ్లా ఆర్మీ అడ్డంకులు సృష్టిస్తూనే వుంది. దీంతో బీఎస్ఎఫ్ కి సుఖదేవ్ పూర్ వాసులు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. సెక్యూరిటీ ఫోర్స్ గా, రక్షణ కవచంలా నిల్చున్నారు.
బంగ్లాదేశ్ ఆర్మీకి వ్యతిరేకంగా భారత్ మాతాకీ జై, వందే మాతరం, జై శ్రీరాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. స్థానికుల మద్దతు లభించడంతో బంగ్లాదేశ్ ఆర్మీ బిత్తరపోయింది. కాస్త వెనక్కి కూడా తగ్గింది. ఈ ఘటన చూస్తుంటే ప్రజల్లో జాతీయవాద భావాలు సజీవంగానే వున్నాయని, భారత భూమి పట్ల అత్యంత శ్రద్ధాసక్తులు చూపిస్తున్నారని అర్థమైపోయింది. ఫెన్సింగ్ పనిని రెండు దేశాలు ముందుగానే అంగీకరించాయి.
అయినా… బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనించాల్సిన విషయం. భారత్ సరిహద్దులో కంచె పనులు చేస్తుండగా బంగ్లాదేశ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆందోళనకు దిగడంతో అంతరాయం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య ముందే ఒప్పందం కుదిరినా.. బంగ్లాదేశ్ వైపు ఆందోళన చేయడం ఖండిచాల్సిన అంశం. భారత్ పనులకు అంతరాయం ఏర్పడినా.. standard Border Management communication protocols అనుసరించి, పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అని అధికారులు తెలిపారు.