పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ప్రతిష్ఠిద్దాం : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగాహన కల్పించేందుకు మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా బస్ స్టాపులు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వాల్ పోస్టర్లను ప్రదర్శన చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతిలను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భక్తులను కోరారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి జిల్లాకు రెండు వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు