భగవద్గీతకి, భరత ముని నాట్య శాస్త్రానికి ‘‘యునెస్కో’’ గుర్తింపు
భగవద్గీతకి, భరతముని నాట్య శాస్త్రానికి ప్రపంచ ఖ్యాతి లభించింది. యునెస్కో మెరమీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో ఈ రెండింటికీ చోటు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోందని, ఈ రచనలు మన జీవన విధానానికి పునాదులు. ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు. యునెస్కో రిజిస్టర్ లో చోటు దక్కించుకున్నాయి’ అని రాసుకొచ్చారు.
ఇక.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘనతపై స్పందించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. గీత, నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్ లో చేర్చడం అంటే మన జ్ఞాన సంపదకి, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు అని హర్షం వ్యక్తం చేశారు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే వున్నాయని మోదీ అన్నారు.