పర్యావరణ పరిరక్షణకు లక్ష మట్టి వినాయక ప్రతిమల తయారీ : భారతీయ కిసాన్ సంఘ్
పర్యావరణ పరిరక్షణకు లక్ష మట్టి వినాయక ప్రతిమల తయారీకి శ్రీకారం చుట్టామని భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి తెలిపారు.విశాఖపట్నం జిల్లా శివాజీపాలెంలోని ప్రకృతి ఆధారిత రైతు సంఘం కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విశాఖ వేదికగా మట్టి వినాయక ప్రతిమల తయారీపై పోటీలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌లో ప్రజలంతా పాల్గొవాలన్నారు. మట్టి ప్రతిమల తయారీపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక వేదికగా నిలుస్తుందన్నారు. దీని ద్వారా వారిలో దాగిన వున్న సృజనాత్మకతను వెలికితీయడమేకాకుండా ప్రకృతిని కాపాడానికి చక్కని మార్గంగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో ప్రకృతి ఆధారిత వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యం వర్మ, సంస్థ కార్యదర్శి పాలెం నేచురల్స్ అశోక్, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్‌కుమార్, జల శక్తి మిషన్ విశ్రాంత అఽధికారి కృష్ణ, రంగచార్యులు పాల్గొన్నారు.