గో ఆధారిత వ్యవసాయమే అన్ని సమస్యలకూ పరిష్కారం : భారతీయ కిసాన్ సంఘ్

భారతీయ కిసాన్ సంఘ్ మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ సమావేశాలకు దేశ వ్యాప్తంగా 37 ప్రాంతాల నుంచి కిసాన్ సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ముఖ్యమైన విషయంపై తీర్మానం చేశారు. గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయాన్ని, గో ఆధారిత వ్యవసాయ వాణిజ్యాన్ని, దేశీయ గోవులను అభివృద్ధి చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించిందని అఖిల భారత ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్ మిశ్రా పేర్కొన్నారు.
అలాగే దేశీయ జాతులను అభివృద్ధి చేయాలని కూడా సంకల్పించింది. దేశీ ఆవుల కారణంగా నేల పోషణ బాగా అవుతుందని, అధిక పాల ఉత్పత్తులు, వ్యాధి నిరోధకత, గోమయంలో వుండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు నేలకు బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అయితే దేశ వ్యాప్తంగా పశువుల జనాభాను తుడిచిపెట్టేయడానికి వీర్యం సాంకేతికతను ఉపయోగించడాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేసింది.
kisan2
గో ఆధారిత వ్యవహారం దేశం, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను చూపిస్తుందని దినేష్ కులకర్తి అన్నారు. గో ఆధారిత వ్యవసాయం, వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు పునాది అని అన్నారు. ఇది అత్యంత విజయవంతంమైన నమూనా అని, దీనిని సమాజానికి అందించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ సమితి కార్యకర్తలే సంఘటనకు పునాది అని, కార్యక్రమాల గురించి చింత అవసరం లేదని, కార్యకర్తల గురించే చింత చేయాలని సూచించారు. నేను అన్న భావంతో కాకుండా, మనం అన్న భావనతో పని చేయాలని సూచించారు.
కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షుడు కె. సాయి రెడ్డి సంస్థాగత, ఉద్యమ మరియు నిర్మాణాత్మక పనిని పెంచాలని పిలుపునిచ్చారు. రాబోయే స్వర్ణోత్సవ సంవత్సరంలో సంస్థ లక్ష గ్రామాలకు విస్తరిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీని కోసం నిరంతర పర్యటనలు, వార్షిక ప్రణాళిక, శిక్షణా తరగతులు, సభ్యత్వ, ప్రచారం లాంటివి మాధ్యమంగా వుంటాయన్నారు.ఈ మూడు రోజుల సభల్లో ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించలేదు. రోజువారీ వ్యవహారాల్లో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు.
kisan23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *